AP Government Allows Ram Charan's Peddi Premiere Shows : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే మూవీ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుండగా... ఏపీ ప్రభుత్వం ప్రీమియర్ షోస్తో పాటు టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చింది.
టికెట్ రేట్స్ ఇవే...
జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధర రూ.600 (GSTతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే, జూన్ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీ ఫ్లెక్సుల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. వీటితో పాటే రోజుకు 5 షోస్ వేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
తెలంగాణలో...
తెలంగాణలో టికెట్ ధరలు పెంపు, ప్రీమియర్ షోస్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీ విధానంపై కాంట్రవర్సీ నెలకొనగా... ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. పెద్ది వరకూ సింగిల్ స్క్రీన్లలో రెంటల్ విధానంలోనే షోస్ వేసేందుకు ఎగ్జిబిటర్స్ అంగీకరించారు. జూన్ 30 తర్వాత రిలీజయ్యే సినిమాలకు పర్సంటేజీ విధానంలో షోస్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అటు, అడ్వాన్స్ బుకింగ్స్ కోసం మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తుండగా ముందుగా ఏపీలో టికెట్ బుకింగ్స్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడ్డాక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి.
ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేశారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, అజయ్ ఘోష్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మించారు.
Also Read : నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రియల్ లైఫ్ స్టోరీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Author : Ganesh Guptha

