Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Twitter Review : పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?

Peddi Twitter Review : పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?

ABP దేశం 1 week ago

Ram Charan's Peddi Twitter Review In Telugu : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది ప్రీమియర్ షో ప్రారంభమయ్యాయి.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. మూవీ చూస్తోన్న మెగా ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు.

రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్

చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న చరణ్‌కు పెద్దితో ఆ కోరిక నెరవేరిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. 3 గంటల 9 నిమిషాల రన్ టైం ఉన్న మూవీలో హీరో ఎంట్రీ దగ్గర నుంచి మాస్ ఎలివేషన్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. చరణ్, జాన్వీ కాంబో అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కుస్తీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు బీజీఎం హైలెట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్‌లో చరణ్ బాడీ బిల్డింగ్, కుస్తీ పోటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో క్రికెట్, కుస్తీతో పాటు హీరో మాస్ ఎలివేషన్‌ను హైలెట్ చేస్తూనే... ఎమోషనల్‌ను పండించారని రెండు ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, విలన్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. హీరో కుస్తీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam