Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podarillu Serial Today August 27th:రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధమైన మాదవ్....తనవల్లే తమ్ముళ్లు ఇబ్బందిపడుతున్నారని నిర్ణయం

Podarillu Serial Today August 27th:రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధమైన మాదవ్....తనవల్లే తమ్ముళ్లు ఇబ్బందిపడుతున్నారని నిర్ణయం

ABP దేశం 2 weeks ago

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.కేశవ్కు శైలూ ఫోన్ చేసి పెళ్లి గురించి మట్లాడగా...మా అన్నయ్య పెళ్లి జరిగే వరకు నేను చేసుకోనని చెప్పాను కదా అని అంటాడు.ఆ మాటలు విన్న మాధవ్...నా వల్లే వీళ్లంతా ఇబ్బందిపడుతున్నారని బాధపడతాడు.బ్రోకర్ను పిలిచి రెండో పెళ్లి సంబంధం అయినా పర్వాలేదని మాట్లాడమని చెబుతాడు.

కేశవ్కు ఫోన్ చేసిన శైలు
శైలు ఏం చేస్తుందో కనుక్కుందామని కేశవ్ ఆమెకు ఫోన్ చేస్తాడు. తను చాలా కోపంగా ఉందని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నామెడలో తాళికడితే తప్ప నేను సంతోషంగా ఉండలేనని శైలు చెబుతుంది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా మా అన్నయ్యకు పెళ్లికాకుండా నిన్ను పెళ్లిచేసుకోలేనని అంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ ఆమాటలన్నీ వింటాడు.అయితే ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రర్ మ్యారేజీ చేసుకుందామని ఆ తర్వాత మీ అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత మళ్లీ పెళ్లిచేసుకుందామని చెబుతుంది. ఆ మాటలు విన్న కేశవ్...నీకు ఏమైనా పిచ్చిపట్టిందా అని అరుస్తాడు. మాఇంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉందని ఏ నిమిషం పెళ్లి చేస్తారేమోనని భయంగా ఉందని చెబుతుంది. ఏదీ ఏమైనా నేను మాత్రం మా అన్నయ్య పెళ్లికాకుండా నేను పెళ్లిచేసుకోనని తెగిసి చెబుతాడు.వెనక్కి తిరిగి చూడగా మాధవ్ ఉంటాడు. ఎప్పుడొచ్చావని అడిగితే ఇప్పుడే వచ్చానని చెబుతాడు.తనవల్లే ఇంట్లో అందరూ ఇబ్బందిపడుతున్నారని మాధవ్ బాధపడతాడు
పెళ్లి చేసుకోవాలని మాధవ్ నిర్ణయం
ఉదయం పనికి వెళ్లినప్పటికీ మాధవ్ మనసు బాగుండదు. తన పెళ్లి ఇంట్లోవాళ్లకు ఇంత సమస్యగా మారుతుందని అనుకోలేదని అనుకుంటాడు.ఎలాగైనా నేను పెళ్లి చేసుకుని ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని భావిస్తాడు.పెళ్లిళ్ల బ్రోకర్ను పిలిచి మంచి సంబంధం కావాలని అడుగుతాడు. ఎందుకు ఇంత సడెన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని ప్రశ్నించగా....కేశవ్ ప్రేమ సంగతి చెబుతాడు.వాడు నేను పెళ్లిచేసుకుంటే తప్ప పెళ్లి చేసుకునేలా లేడని చెబుతాడు. మీ ఇంటి సంగతి తెలిసిన తర్వాత మీకు ఎవరూ పిల్లను ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారని అంటాడు. ఏదైనా పర్వాలేదని నేను పట్టింపులకు పోనని మాధవ్ అంటాడు. దీంతో బ్రోకర్ సరేనంటాడు.ఇంతలో అతనికి ఓఫోన్ కాల్ వస్తుంది.విడాకులు తీసుకుంటున్న అమ్మాయికి రెండో పెళ్లి సంబంధం కావాలని అవతలి వాళ్లు చెప్పడం విన్న మాధవ్..ఆ అమ్మాయిని నేను చేసుకుంటానని అంటాడు.ఈ విషయం మీనాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడని బ్రోకర్ బయపడిపోతాడు. అవన్నీ నేను చూసుకుంటానని మీరు మాత్రం ఈ సంబధం ఖాయం చేయమని కోరతాడు.దీనికి ఆ బ్రోకర్ కూడా సరేనంటాడు.
మళ్లీ బస్టాండ్లో పడిగాపులు
విక్కీకి అబద్ధం చెప్పినందుకు మహాలక్ష్మీ చక్రిని పిచ్చితిట్టుడు తిడుతుంది.అయినా అలా ఎందుకు చెప్పావని అడుగుతుంది. మీ విక్కీ ఏంటండీ మరీ అంతగా కేర్ చూపించాలా అని చక్రి నిలదీస్తాడు.వాడి పద్దతి ఏం బాగాలేదని అంటాడు.ఈకాలంలో కూడా ఎంప్లాయిస్పై కేర్ చూపించే ఓనర్ ఉండటం అదృష్టమని మహా అంటుంది.ఏదీఏమైనా అతను ఇలా చేయడం నాకు నచ్చలేదని చెప్పగా...మహా మళ్లీ తిట్టడంతో సారీ చెబుతాడు. మళ్లీ బస్టాండ్లో అమ్మాయి కోసం కన్నా, చక్రి, మహా ఎదురుచూస్తుంటారు. అప్పుడే రోజూ చూసే ఇద్దరు అమ్మాయలు అక్కడికి వస్తారు. కన్నాను ప్రేమిస్తున్న అమ్మాయిని వెళ్లి నెంబర్ తీసుకోమని తన ఫ్రెండ్ అడిగితే.....నాకు భయంగా ఉందని నువ్వే వెళ్లి తీసుకుని రా అని పంపిస్తుంది. ఇటు నుంచి చక్రి కూడా వాళ్ల తమ్ముడిని ముందుకు నెడతాడు. కన్నా దగ్గరకు ఆ అమ్మాయిరాగా....తనే నన్ను ప్రేమిస్తుందేమోనని కన్నా అనుకుంటాడు.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam