Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.మాధవ్కు పెళ్లిచూపుల కోసం చక్రి,కేశవ్ సంబంధం వెతుకుతారు.అందుకు మాధవ్ జాతకం కావాలని చెప్పడంతో మహాలక్ష్మీ ఇళ్లంతా వెతికించి జాతకం బయటకు తీయిస్తుంది.
అటు శైలూ ఇంట్లో వాళ్లను బెదిరించి మరీ పనులన్నీ చేయించుకుంటుంది. ఇంతలో ఆడపెళ్లివారు మాధవ్ను చూడటానికి రాగా...వాళ్లకు చాలా జాతకం, వాస్తు పిచ్చి ఉండటం చూసి నారాయణ కుటుంబం కంగారుపడుతుంది.
శైలు బెదిరింపులు...తల్లి బెంబేలు
మాధవ్కు సంబంధాలు చూడటం కోసం చక్రి, కేశవ్ మధ్యవర్తిని కలిసి అన్ని విషయాలు చెబుతారు. మా ఇల్లు ఇంతకు ముందులా లేదని నాకు పెళ్లి అయ్యిందని...మా కేశవ్కు కూడా అమ్మాయి దొరికిందని...మా అన్నయ్య పెళ్లి చేస్తే వాడి పెళ్లికూడా చేస్తామని చక్రి చెబుతాడు. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చెబుతానని అంటాడు.ఇంతలో రోడ్డుమీద సురేశ్ కనిపించడంతో చక్రి వాడిని ఏడిపిస్తాడు.దీంతో వాడు కోపంగా ఇంటికి వెళ్లిపోతాడు. అక్కడ శైలు ఇంట్లో వాళ్ల అమ్మతో ఆడుకుంటుంది. అన్నం పెట్టమంటే పెట్టనని వరాలు చెప్పగానే....ఫోన్ తీసి పోలీసులను పిలవమంటావా అని అంటుంది.దీంతో తల్లి అన్నం పెడుతుంది. మళ్లీ తిట్టగా...పోలీసులను పిలుస్తానని బెదిరిస్తుంది. అటు సురేశ్ను కూడా బెదిరించడంతో దాని జోలికి ఎవరూ వెళ్లొద్దని శంకర్ కొడుకుని గట్టిగా మందలిస్తాడు.
మాధవ్ జాతకం కోసం వెతుకులాట
ఇంట్లో అందరూ ఫోన్లు చూసుకుంటూ ఆనందంగా ఉండటం చూసి మహాలక్ష్మీ మళ్లీ గట్టిగా అందరిపై అరుస్తుంది. మేం ఆల్రెడీ మధ్యవర్తికి చెప్పామని చక్రి అంటాడు.అంటే అంతటితో పని అయిపోయినట్లేనా..అని అంటుంది. పెళ్లి అంటే జాతకాలు చూసుకుని చేసుకుంటారని...నీలా పోలీసుస్టేషన్లో తాళి కట్టరని చక్రికి క్లాస్ పీకుతుంది. ముందు వెళ్లి మీ అన్నయ్య జాతకం ఎక్కడ ఉందో చూడమని అరుస్తుంది. నారాయణను పిలిచి అడగ్గా...ఆ పెట్టెల్లో ఎక్కడ ఉందో చూసుకోమని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ మళ్లీ వెతుకుతారు.అయినా జాతకం కనిపించదు. ఆ నారాయణ వస్తే తప్ప...ఈ జాతకం ఎక్కడ ఉందో తెలియదని చక్రి అంటాడు.
మందు దాచిపెట్టిన మహా...జాతకం వెతికిపెట్టిన నారాయణ
నారాయణ మందు తాగేందుకు అన్నీ సిద్ధం చేసుకుని ఉండగా....మహాలక్ష్మీ వచ్చి క్వార్టర్ బాటిల్ లేపేస్తుంది. ముందు మర్యాదగా వెళ్లి జాతకం ఎక్కడ ఉందో వెతికి తెస్తేనే నీ మందు బాటిల్ ఇస్తానని మెలికపెడుతుంది. దీంతో నారాయణ లోపలికి వెళ్లి పాత పెట్టెలన్నీ వెతికి మొత్తానికి ఓ పాత పుస్తకం కనిపెడతాడు. అందులోనే మీ అందరి జాతకాలు ఉన్నాయని చెబుతాడు. ఇంత తాగుబోతువి మా జాతకాలు ఎలా రాయించావని అడగ్గా....నేను రాయించలేదని..మీ అమ్మ ఇవన్నీ రాయించిందని చెప్పడంతో మహాలక్ష్మీ క్వార్టర్ బాటిల్ తిరిగి ఇచ్చేయడంతో నారాయణ ఆనందంగా అది తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. ఇంతలో మాధవ్ వచ్చి ఇప్పుడు ఈ జాతకాలన్నీ ఎందుకమ్మా అని అడగుతాడు. ఆ ఆఫీసులో ఓ జాతకాలు చూసే అతను ఉన్నాడని అతనికి చూపిద్దామని అబద్ధం చెబుతుంది.
మాధవ్ పెళ్లి చూపులకు ఏర్పాట్లు
మాధవ్కు చెప్పకుండానే పెళ్లిచూపులకు మహా ఏర్పాట్లు చేస్తుంది. మాధవ్ను తీసుకుని వచ్చిన కేశవ్...ఏంటమ్మా ఇదంతా అని అడిగితే నీకు పెళ్లిచూపులని చెబుతుంది. నాకు ఇవన్నీ వద్దని చెప్పాను కదా అని అంటే మహాకు కోపం వచ్చి నేను మళ్లీ హాస్టల్కు వెళ్లిపోతానని బెదిరించడంతో మాధవ్ సరేనంటాడు. కన్నా మాధవ్ను తీసుకుని వెళ్లి మేకప్ వేస్తాడు.అసలు పెళ్లి చూపులు ఆడపెళ్లి వారి ఇంట్లో జరగాలి కదా అని నారాయణ అడిగితే....మనం వెళ్లిచూసిరావడం వాళ్లు వచ్చి మన ఇల్లు చూసి వద్దనడం బాగాలేదని..అందుకే వాళ్లను రమ్మని అంతా చూపించి నిజాలు చెప్పిన తర్వాతే పెళ్లికి ఏర్పాట్లు చేద్దామని ఇలా చేశానంటుంది. ఇంతలో ఆడపెళ్లివారు వస్తారు.అయితే ఆ పిల్ల తండ్రికి జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉండటం చూసి ఇక ఈ పెళ్లి జరిగినట్లేనని నారాయణ అనుకుంటాడు.
Author : Ajay Kumar

