Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podarillu Serial Today July 6th :కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి

Podarillu Serial Today July 6th :కేశవ్‌తో ప్రేమ విషయం తెలిసి శైలూ ఇంట్లో గొడవలు...మహాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి

ABP దేశం 4 months ago

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. విడాకుల కోసం లాయర్ను కలవనున్నట్లు మహాలక్ష్మీ పెద్దిసహా అందరినీ పిలిచి చెబుతుంది.

తాను అడిగినట్లు విడాకులు ఇచ్చే మళ్లీ ఆమెను నా ప్రేమతో గెలిపించుకుంటానని చక్రి అంటాడు. మరోవైపు శైలూ ఇంట్లో కేశవ్ విషయం తెలిసి వాళ్ల అమ్మ ఆమెను కొడుతుంది. అలాగే శైలూ తమ్ముడు కూడా కేశవ్తో వాళ్ల అక్కను చూసి గొడవ పెట్టుకోవడానికి బృందావనానికి వెళ్తాడు.

శైలూపై చేయిచేసుకున్న తల్లి
మెకానిక్ షాప్ దగ్గర కేశవ్తో శైలూను చూసిన వాళ్ల నాన్న గొడవపెట్టుకుంటాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి శైలూ వాళ్ల నాన్నను అక్కడి నుంచి పంపివేస్తుంది. ఇంటికి వచ్చేసరికి శైలూ వాళ్ల నాన్న చాలా కోపంగా ఉంటాడు. నా పరువు తీశావని మండిపడతాడు.అప్పుడే వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి ఏమైందని అడిగితే నీ కూతురు ఓ మెకానిక్ను ప్రేమించిందని....వాడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని చెప్పడంతో ఆమె శైలూపై చేయిచేసుకుంటుంది. అందుకే దీన్ని గారాభం చేయవద్దని చెప్పానని భర్తపై మండిపడుతుంది.త్వరగా పెళ్లి చేసి పంపించేయమంటే నామాట వినకుండా చదివించినందుకు బాగా చేసిందని అరుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదని ...వాడిని మర్చిపోమని తండ్రి శైలూకు చెబుతాడు. అది ఎట్టిపరిస్థితుల్లో జరగదని...పెళ్లంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానని శైలూ తేల్చి చెబుతుంది.లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది.ఇంతలో శైలూ అన్న అక్కడికి వస్తాడు. వాడి రావడం చూసి అందరూ సైలెంట్గా ఉండిపోతారు.

విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన చక్రి
ఉదయం ఆఫీసుకు వెళ్తూ మహా అందరినీ పిలుస్తుంది. ఈరోజు మేం లాయర్ను కలవడానికి వెళ్తున్నామని చెప్పడంతో అందరూ షాక్ తింటారు.ఇంత అర్జెంట్గా ఎందుకమ్మా అని అడిగితే...మాకు జరిగింది నిజమైన పెళ్లికానప్పుడు విడాకులు తీసుకోవడమే బెటరని అంటుంది. అందుకే సాయంత్రం లాయర్ను కలిసి విడాకులకు అప్లై చేస్తామని చెప్పి వెళ్లిపోతుంది. చక్రి బాధపడటం చూసి మాధవ్, కేశవ్ వాడిని ఓదార్చడానికి వస్తారు.దీంతో చక్రి వాళ్లిద్దరిపైనా అరుస్తాడు.మీ వల్లే ఇదంతా జరిగిందని మండిపడతాడు.అసలు ఏ రోజు అయినా మీరు మా ఇద్దరినీ కలపడానికి ప్రయత్నించారా అని నిలదీస్తాడు.

ఎప్పడూ ఏదో ఒకటి చేసి దూరం చేయడం తప్ప...ఏరోజు అయినా సాయం చేశారా అని అడుగుతాడు.
మీరు కలిసి ఉంటే సంతోషించే వాళ్లం మేమేకదా అని కేశవ్ అంటాడు. అలా అనుకుంటారు తప్ప...ఏరోజైనా చొరవ చూపించారా అని చక్రి మండిపడతాడు. ఇప్పడు ఏం చేస్తావని అడిగితే...మహా అడిగినట్లే విడాకులు ఇస్తానని....ఎలాగూ ఆరునెలల సమయం ఉంటుంది కాబట్టి అలోగా తనను నా ప్రేమతో తిరిగి దక్కించుకుంటానని అంటాడు.
శైలూ అన్నయ్య గొడవ
కేశవ్ను కలవడానికి మెకానిక్ షెడ్డు వద్దకు వచ్చిన శైలూను రాత్రి ఏం జరిగిందని అడుగుతాడు. ఏం అవుతుంది నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని చెప్పేశానని చెబుతుంది. నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని కేశవ్ అంటాడు.నా ధైర్యం నువ్వేనంటూ శైలూ ఆటపట్టిస్తుంది. మా ఇంట్లోనే అన్ని గొడవలు జరుగుతున్నాయని చెబుతాడు. మా చక్రి, మహా విడిపోవడానికి విడాకులు తీసుకుంటున్నారని చెప్పడంతో శైలూ ఏం అలా జరగదులే అని చెబుతుంది. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా... శైలూను వాళ్ల అన్న చూసి ఇంటికి వెళ్లి మళ్లీ గొడవ చేస్తాడు. వాడి దగ్గరకు వెళ్లొద్దంటే మళ్లీ ఎందుకు వెళ్లావని తల్లి కొడుతుంది. దీనిపని ఇలా కాదంటూ శైలూ వాళ్లఅన్న తన ఫ్రెండ్స్ను తీసుకుని కేశవ్ వాళ్ల ఇంటికి గొడవకు వెళ్తాడు.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam