Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podarillu Serial Today Sep1st:మహాకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని ప్రయత్నించి బోల్తాపడిన చక్రి....ఆదికి రాఖీ కట్టిన మహాకు దక్కిన బహుమతి ఏంటి..?

Podarillu Serial Today Sep1st:మహాకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని ప్రయత్నించి బోల్తాపడిన చక్రి....ఆదికి రాఖీ కట్టిన మహాకు దక్కిన బహుమతి ఏంటి..?

ABP దేశం 1 week ago

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.

మహాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి విక్కీకి రాఖీ కట్టమని అడుగుతాడు.విక్కీ వల్ల చక్రి బాగా ఇబ్బందిపడుతున్నాడని గమనించిన మహా...తనకు తప్ప లోకంలో ఎవరికైనా రాఖీ కడతానని అంటుంది.అటు విక్కీ కూడా కట్టించుకోనని అంటాడు.దీంతో చక్రి మహాను ఆది దగ్గరకు తీసుకెళ్లి రాఖీకట్టిస్తాడు. కానీ ఆది ఇచ్చిన బహుమతిని చూసి మహా పిచ్చిగా తిట్టి వచ్చేస్తుంది.
చక్రికి మహా షాక్
రాఖీ పండుగ సందర్భంగా సర్ఫ్రైజ్ ఇస్తానని చెప్పి చక్రి మహాను తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పినా చెప్పడు. నేరుగా మహావాళ్ల ఆఫీసుకు తీసుకుని వస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావని అడిగితే చెబుతానంటూ నేరుగా విక్కీ క్యాబిన్లోకి తీసుకుని వెళ్లి ఇక మీ బాస్కు రాఖీ కట్టండని అంటాడు.ఆ మాటలకు విక్కీ అదిరిపడతాడు. అదేంటని అడిగితే...ఊరుగాని ఊరులో మీరు ఉద్యోగం కోసం కష్టపడుతుంటే ఓ అన్నలా మిమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి మీరు రాఖీ కట్టండని అంటాడు. మీరిద్దరూ ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా...తోబుట్టువుల్లా ఉన్నారని అంటాడు. చక్రి మాటలకు మహా మండిపడుతుంది. అంటే విక్కీ నాకు ఎక్కడ దగ్గరవుతాడేమోనని చక్రి భయపడుతున్నట్లు ఉన్నాడని అనుకుంటుంది. ఇప్పుడు బాగా దొరికిపోయాడు నాకు ఇక ఆడుకుంటానని అనుకుంటుంది. వెంటనే కల్పించుకుని విక్కీ నాకు అన్నయ్య అని ఎవరు చెప్పారని చక్రిని ప్రశ్నిస్తుంది.అసలు నేనెప్పుడూ విక్కీని అన్నలా చూడలేదని అంటుంది. నేను విక్కీకి రాఖీ కట్టనంటే కట్టనని చెబుతుంది. అటు విక్కీ కూడా నేను ఎప్పుడూ మహాను చెల్లిలా చూడలేదని నేను కూడా కట్టించుకోనని అంటాడు.ఆమాటలు విన్న చక్రి గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీళ్లకు షాక్ ఇవ్వాలని వస్తే...వీళ్లిద్దరూ కలిసి నాకు గుండెపోటు తెప్పించేలా ఉన్నారని భయపడతాడు. ఇతను ఇక్కడికి తీసుకొచ్చే వరకు నాకు తెలియదు విక్కి ఇందుకోసమని అని మహా అంటుంది. ఇంతలో విక్కీ కల్పించుకుని మీరు ఆమెకు కజిన్ కాబట్టి మీరే మహాతో రాఖీ కట్టించుకోండని అంటాడు. దీంతో చక్రి ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉందని అనుకుంటాడు. మహా కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఆమె వెంట చక్రి కూడా వెళ్తాడు. మహా నాకు రాఖీ కట్టనని చెప్పిందంటే నాపై ఏదో ఫీలింగ్ ఉన్నట్లేనని విక్కీ ఆనందపడిపోతాడు.
మహాకు సర్ప్రైజ్ ఇచ్చిన చక్రి
ఆఫీసు నుంచి బయటకు రాగానే మహా చక్రిని పిచ్చిగా తిడుతుంది. అయినా నేను మా బాస్కు రాఖీ కడతానని ఎలా అనుకున్నావని నిలదీస్తుంది. ఇప్పుడు వదిలిపెడితే కొట్టినా కొడుతుందని భయపడిన చక్రి....వెంటనే టాఫిక్ డైవర్ట్ చేసి నీకు మరో సర్ఫ్రైజ్ ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్తాడు. షాపింగ్కు వెళ్దామని చెప్పి నిహారిక ఆదిని తీసుకుని హైదరాబాద్ వస్తుంది. ఓ రెస్టారెంట్లో ఉండి ఆదికి నచ్చజెబుతుంది.ఇప్పుడు మీరు ఏమాత్రం కోప్పడనని నాకు మాటివ్వాలని కోరుతుంది. దీంతో ఆది ఆమెకు మాటిస్తాడు. మనం షాపింగ్ కోసం ఇక్కడికి రాలేదని చెబుతుంది. మరి ఎందుకు వచ్చామని అడుగుతుండగానే...చక్రి మహాను తీసుకుని అక్కడికి వస్తాడు. వాళ్లిద్దరినీ చూడగానే ఆదికి కోపం పెరిగిపోతుంది. మహా రానని చెప్పినా నిహారిక వెళ్లి లాక్కుని వస్తుంది.ఇద్దరు అన్నాచెల్లెల్లు తిట్టుకుంటుండగానే...నిహారిక రాఖీ తీసుకుని ఇస్తుంది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూనే తిట్టుకుంటారు. మహా ఆదికి రాఖీ కడుతుంది. స్వీట్ తినిపిస్తుంది.ఆది కూడా ఆమెను అక్షింతలు వేసి దీవిస్తాడు. చివరిలో వెళ్లిపోతుండగా....ఆది డబ్బులు ఇచ్చి మహాను అవమానిస్తాడు. ఈ డబ్బులు తీసుకుని వెళ్లండి..మీ మందకు నెలరోజులు సరిపడా సరుకులు వస్తాయని అంటాడు.దీంతో మహాకూడా అంతే గట్టిగా బదులిస్తుంది.నీలాంటి కుక్కలు ఎన్ని వచ్చినా ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదని అంటుంది.దీంతో ఇద్దరూ మళ్లీ తిట్టుకుంటారు.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam