Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podarillu Serial Today Sep3rd:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ

Podarillu Serial Today Sep3rd:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ

ABP దేశం 1 week ago

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. బస్టాండ్ అమ్మాయి గోపికను కలవడానికి వెళ్లి మహాను చక్రి బాగా ఉడికిస్తాడు.కోపంతో రగిలిపోయిన మహా..చక్రితో ఇంట్లో పనులన్నీ చేయించి మహా కక్షతీర్చుకుంటుంది.అటు పెళ్లివాళ్లు వస్తున్నారని మాధవ్ మహాలక్ష్మీ చెప్పడంతో పెళ్లిచూపులకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

గోపిక కోసం బయలుదేరిన శ్రీకృష్ణుడు

పెళ్లి వాళ్లు సాయంత్రం వస్తున్నారని చెప్పినప్పటి నుంచి మాధవ్ ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలని చాలా మదనపడిపోతుంటాడు. పరధ్యానంలో ఉన్న పెద్దిని మహా ఏం జరిగిందని అడిగితే...ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటాడు.మహా,కన్నా వెళ్లడానికి బయలుదేరగా...అప్పుడే అక్కడికి చక్రి కూడా కొత్త చొక్కవేసుకుని ఒళ్లంతా సెంట్ కొట్టుకుని వస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావని కన్నా అడిగితే...మా బస్టాఫ్ చిలక కోసం అని చెబుతాడు. ఆ మాటలకు చక్రిని చంపేయాలని కోపం వచ్చినా...మహా మాత్రం బయటపడదు. ఆమె ఉడుక్కుంటుందని తెలిసి చక్రి మరింత రెచ్చిపోతాడు. మాధవ్ అక్కడికి వచ్చి పిచ్చిపిచ్చి వేషాలు వేశావంటే దెబ్బలు పడతాయని హెచ్చరిస్తాడు.ఇందులో తప్పేమి ఉందని చక్రి అంటాడు.మనం ప్రేమించే వాళ్లు మనల్ని పట్టించుకోనప్పుడు...మనల్ని ప్రేమించేవాళ్లను ప్రేమించడంలో తప్పులేదు కదా అని అంటాడు. దీంతో మహా కూడా నాకు ఎలాంటి అసూయ లేదని చెప్పడంతో మరి ఇక ఆలస్యం ఎందుకు అని చెప్పి చక్రి టిప్టాప్గా రెడీ అయ్యి వెళ్లిపోతాడు. మహా కూడా కన్నాను తీసుకుని వెళ్తుంది. వీడేంటిరా మహా ముందు ఇలా చేస్తున్నాడని మాధవ్ కేశవ్తో అంటాడు.వాడితిప్పలు వాడు పడుతున్నాడని నువ్వు ఏమీ అడ్డుపడొద్దని చెబుతాడు.

బస్టాఫ్లో రెచ్చిపోయిన చక్రి

మహా,కన్నా కన్నా ముందే బస్టాఫ్కు చేరుకుని చక్రి గోపికకు లైన్ వేస్తుంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన కన్నా...చూడు వదిన ఎలా సిగ్గులేకుండా నా పిల్లకు లైన్ వేస్తున్నాడోనని అంటాడు. నీకు అప్పుడే ఇంకా వయసురాలేదులేరా అని మహా అంటుంది. చక్రిని చూసి చాలా కోపంగా ఉంటుంది. వీళ్లు వచ్చారని తెలిసి చక్రి ఇంకా రెచ్చిపోతాడు. కూలింగ్ గ్లాస్ పెట్టికుని ఫోజులు ఇస్తుంటాడు. అది చూసిన కన్నా నీకు చక్రిపై ఎలాంటి అసూయ లేదా వదినా అని కన్నా అడుగుతాడు.నాకు ఎందుకు ఉంటుందని అంటుంది. మహా చూస్తుందని తెలిసి చక్రి గోపిక దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు.నేను మీకు ఎప్పటి నుంచి తెలుసునని అడుగుతాడు.నేను చాలాసార్లు మీ క్యాబ్ ఎక్కానని ఆమె చెబుతుంది. అలా వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసి మహా ఉడుక్కుటుంది.ఇటు కన్నా కూడా గోపిక ఫ్రెండ్ను లైన్లో పెడుతుంటాడు.ఇద్దరూ ఇద్దరేనని తిట్టి మహా ఆటో ఎక్కి వెళ్లిపోతుంది.ఆ తర్వాత చక్రి వెళ్లిపోదామనుకున్నా....గోపిక పట్టుకుని సెల్నెంబర్ అడిగి తీసుకుంటుంది.

చక్రిని ఆడుకున్న మహా

మహాలక్ష్మీ ఆఫీసుకు వెళ్తుండగా పెద్ది అక్కడికి వస్తాడు. తన పెళ్లిచూపులు గురించి చెబుతాడు. ఇంత మంచి విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా అని మహా అంటుంది.నాకు కూడా ఇప్పుడే తెలిసిందని పెద్ది చెప్పి...ఇంట్లో ఎవరికీ చెప్పలేదని నువ్వు అన్నీ చూసుకోమని చెబుతాడు. ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా వచ్చిన మహా....చక్రిని పిలిచి ఆడుకుంటుంది. ఇళ్లంతా ఊడ్చితుడిపిస్తుంది. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కడగమని ఆర్డర్ వేస్తుంది.ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు కదూ అని చక్రి ఏడుస్తాడు. నాకు నీమీద ఎలాంటి అసూయ లేదని....ఇంట్లో పనులన్నీ రోజూ మీ అన్నయ్య ఒక్కడే చేస్తుంటే మీరు తిని తిరుగుతున్నారని చెప్పి అన్ని పనులు చేయిస్తుంది.

Author : ABP Desam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam