Dailyhunt
Podharillu Serial Today May 5th: రిసార్ట్స్‌కు బయలుదేరిన చక్రి కుటుంబం...మార్గమధ్యలో మామాకోడళ్ల ఫోజులు

Podharillu Serial Today May 5th: రిసార్ట్స్‌కు బయలుదేరిన చక్రి కుటుంబం...మార్గమధ్యలో మామాకోడళ్ల ఫోజులు

ABP దేశం 1 week ago

Podharillu Serial Today Episode: ఇంట్లో ఉండి కన్నావాళ్ల అమ్మ గురించే ఆలోచిస్తున్నాడని వాడిని తీసుకుని మహాలక్ష్మీ బయటకు వెళ్తుంది. చెరువుగట్టుపై కూర్చోబెట్టి మళ్లీ వాడికి పెద్ద క్లాస్ పీకుతుంది.

మీ అమ్మగురించి ఆలోచించడం మానేసి నువ్వే ప్రాణంగా బతుకుతున్న మీ అన్నయ్యల గురించి ఆలోచించమని చెబుతుంది. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేసి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని చెబుతుంది. మహాలక్ష్మీ వాళ్లు బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాకపోవడంతో మాధవ్ తీవ్రంగా కంగారుపడిపోతుండగా వాళ్లిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. వాళ్లు వచ్చేసరికి మాధవ్ కన్నాకు ఇష్టమైన బిర్యానీ చేసి పెడతాడు.వాడి మనసు ఎలాగూ మార్చలేకపోతున్నామని....కనీసం వాడి మనసుకు ఇష్టమైనవి అయినా వండిపెడదామని మాధవ్ అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది వాడికి అని అడుగుతాడు. నేను సాధ్యమైనంతవరకు చెప్పి చూశానని..కానీ చిన్న వయసు కాబట్టి వాడు ఇదంతా అప్పుడే మర్చిపోవడం సాధ్యం కాదని మహాలక్ష్మీ చెబుతుంది.మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయని చెబుతుంది.మీరు కూడా దీని గురించే ఆలిచించి వాడిని మరింత బాధపెట్టొద్దని మహాలక్ష్మీ చెబుతుంది.
మాధవ్ కన్నా దగ్గరకు వెళ్లి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు.అసలు మా అమ్మ ఎవరు అని కన్నా నిలదీస్తాడు. మీ అమ్మను అయితే నాన్న చంపేశాడని చెబుతున్నారు.మరి మా అమ్మను కూడా చంపేశాడా లేక ఆమె వెళ్లిపోయిందా అని అంటాడు. నాన్న రోజూ తాగి వచ్చి కొట్టేవాడా అని అడుగుతాడు. ఏ తల్లి అయినా కన్నబిడ్డను వదిలి వెళ్లిపోదు కదా...మరి మా అమ్మ నన్ను ఎందుకు వదిలి వెళ్లిపోయిందని నిలదీస్తాడు. బిడ్డను కూడా వదిలి వెళ్లిపోయేంత కష్టం ఆమెకు ఎందుకు వచ్చిందని అడుగుతాడు. ఇవన్నీ నాకు తెలియదు రా...అంత తెలుసుకునే వయసు కూడా లేదని చెబుతాడు. నిన్ను తీసుకొచ్చి ఆ ఒడిలో పెట్టి పెంచమని మాత్రమే నాన్న చెప్పాడని....నేను అంతకు మించి ఆయన్ను ఏం అడగలేదని అంటాడు. అసలు ఇదంతా ఆ ఫొటో వల్లే వచ్చిందని మాధవ్ అంటాడు. ఆ ఫొటో అప్పుడే చించిపడేయకుండా నేను పెద్ద తప్పు చేశానని అంటాడు.ఆ ఫొటో లేకుంటే అసలు నువ్వు దీని గురించి ఆలోచించేవాడివే కాదని అంటాడు.

ఇంట్లో అందరూ చాలా డిస్టర్బ్గా ఉండటంతో చక్రి బయటకు వెళ్దామా అని మహాలక్ష్మీని అడుగుతాడు.తనను బయటకు తీసుకెళ్లి సంతోషపెట్టి తన మనసులో చోటు సంపాదించుకోవాలని ప్లాన్ వేస్తాడు. అయితే పెద్దిని, కన్నాను తీసుకెళ్లమని వాళ్లే చాలా బాధలో ఉన్నారని మహా చెబుతుంది. వాళ్లు వస్తే వాళ్లతోపాటు నువ్వు కూడా వస్తావులే అని చక్రి మాధవ్, కేశవ్, కన్నా దగ్గరకు వెళ్లి ఒకరికి తెలియకుండా ఒకరికి బయటకు వెళ్దామనుకుంటున్నట్లు చెబుతాడు.అందరూ వెళ్దామంటే నేను కూడా వస్తానని మాధవ్ అంటాడు. మాధవ్ మహాను ఒప్పించి టూర్కు బయలుదేరిస్తాడు. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి మీ నాన్నను కూడా తీసుకెళ్దామని మహాలక్ష్మీ చెప్పడంతో అందరూ కలిసి రిసార్ట్కు బయలుదేరతారు. ఆదినారాయణ పూలరంగడులా తయారై వస్తాడు.మార్గమధ్యలో రోడ్డుపక్కన కళ్లజోళ్ల షాపు కనిపిస్తే నారాయణ కారు ఆపించి అక్కడ అందరికీ కళ్లజోళ్లు కొనిపిస్తాడు. కొత్త కళ్లజోళ్లు,టోపీలు ధరించి మామాకోడళ్లు ఫొటోలకు పోజిలిస్తారు.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam