Dailyhunt
Pomegranate Benefits : రోజూ ఒక గిన్నె దానిమ్మ గింజలు తింటే.. శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

Pomegranate Benefits : రోజూ ఒక గిన్నె దానిమ్మ గింజలు తింటే.. శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే

ABP దేశం 5 days ago

Pomegranate Every Day for Health : దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీజన్​తో సంబంధం లేకుండా ఆరోగ్యం కోసం పిల్లలు అయినా పెద్దలు అయినా తీసుకోగలిగే పండ్లలో దానిమ్మ కచ్చితంగా ఉంటుంది.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం నుంచి చర్మానికి సంబంధించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే రోజూ ఓ గిన్నె దానిమ్మ గింజలు తింటే పెద్దలకు, పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.

యాంటీ ఆక్సిడెంట్లు

దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పునికలాగిన్స్, ఆంథోసయానిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ ద్వారా శరీరానికి అందుతాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడి.. శరీరాన్ని కణాల నష్టం నుంచి దూరం చేస్తాయి.

గుండె ఆరోగ్యానికై..

దానిమ్మ రెగ్యులర్​గా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్​ను కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు తెలిపాయి.

మెరుగైన జీర్ణక్రియ

దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగవడంతో పాటు.. మంచి బ్యాక్టీరియాను పెరుగుతుంది.

వాపులు దూరం..

దానిమ్మలో ఉన్న పాలీఫీనాల్స్ శరీరంలోని వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు.

మెరిసే చర్మం..

దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. దీంతో స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.

రోగనిరోధక శక్తి

విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.

మెదడు ఆరోగ్యానికై..

దానిమ్మలోని పాలీఫీనాల్స్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు వీటిని రోజూ తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలాగే పెద్దల్లో అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుతుంది.

బరువును తగ్గించడానికై..

దానిమ్మ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి. దీనివల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. అనవసరమైన క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి తగ్గి.. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.

రక్త ప్రసరణ

చాలామంది దానిమ్మను రక్తం పడతుందని తింటారు. కానీ దానిమ్మ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా సహాయపడటంతో పాటు.. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం..

ప్రాథమిక అధ్యయనాల ప్రకారం దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

కాబట్టి.. రోజూ ఒక గిన్నె దానిమ్మను డైట్లో చేర్చుకుంటే.. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తీసుకుంటే మంచిది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam