Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!

ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!

ABP దేశం 2 weeks ago

ర్భిణిగా ఉన్నప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు...ఆ తర్వాత కూడా చాలా నియమాలు పాటించాలని సూచిస్తుంటారు పెద్దలు. అలాంటి నియమాల్లో ఒకటి ప్రసవం తర్వాత చీపురు ముట్టుకోవద్దని చెప్పడం.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ శరీరం , మనసు అత్యంత సున్నితంగా ఉంటాయి. అందుకే భారతయ సంస్కృతి హిందూ సంప్రదాయాల్లో ప్రసవానంతరం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. వాటిలో ఒకటి చీపురు ముట్టుకోవద్దు, ఇల్లు ఊడ్చొద్దు అని.. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు ఆరోగ్య కారణాలు ఉన్నాయ్.

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

ఆధ్యాత్మిక ధృక్పథంలో

సూతిక సమయంలో తల్లి శరీరం ఆధ్యాత్మికంగా అపవిత్ర స్థితిలో ఉంటుందని నమ్మతారు. వేదకాలం నుంచి ఈ విశ్వాసాన్ని పాటిస్తున్నారు.. ఎందుకంటే.. ప్రసవ సమయంలో తల్లి శరీరం నుంచి రక్తం, ద్రవాలు వెలువడడం వల్ల శక్తుల సమతుల్యం కోల్పోతారు. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు - శుభ్రత, సంపదకు చిహ్నం. సూతిక స్త్రీ దాన్ని తాకితే ఇంటి సంపద పోతుందని , దుష్టశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో చీపురు మంచం కింద ఉంచడం ద్వారా దుష్టశక్తులు దరిచేరవని నమ్ముతారు. శక్తి రక్షణకు సంకేతం అని, బాలింత చీపురు పట్టి తుడవడం వల్ల ఇంటి సానుకూల శక్తి నశిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

ఆయుర్వేదం ప్రకారం

ఆయుర్వేదం ప్రకారం సూతిక పరిచర్యలో భాగంగా 40 నుంచి 60 రోజులు విశ్రాంతి తప్పనిసరి. ప్రసవం తర్వాత గర్భాశయం సంకోచం చెందుతూ, శరీరం వాతం దోషం పెచుతుంది. చీపురుతో ఉడ్చడం, కిందకు వంగి లేవడం, బరువులు ఎత్తడం లాంటివి చేస్తే వెన్నునొప్పి పెరుగుతుంది. ప్రసవానంతరం రక్తస్రావం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా ఇన్ఫెక్షన్లు, హెర్నియా వంటి సమస్యలు రావొచ్చు.

ఆధునిక వైద్యం

ఆధునిక వైద్యం ప్రకారం కూడా..ప్రసవం తర్వాత మొదటి 4 నుంచి 6 వారాలు ఇంటి పనులు నివారించాలని సూచిస్తున్నారు వైద్యులు. తల్లిని సంరక్షించడం ద్వారా ఆమె మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, చిన్నారికి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతాయని చెబుతారు. చీపురు అంటే దుమ్ము,బ్యాక్టీరియా, ఫంగల్ ఉంటాయి. ప్రసవం తర్వాత స్త్రీ శరీరం ..ముఖ్యంగా గర్భాశయం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే ప్రమాదం..అందుకే బాలింతను శుభ్రమైన గదిలో ఉంచేవారు. పైగా 40 రోజుల పాటు వేరే ఇతర పనులేమీ పెట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం , బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడంపైనే ఉండాలనే ఆంతర్యం కూడా.

పేదరాసి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా ఉండేదా? ఆమె గురించి పుస్తకాల్లో ఏముంది?

సంప్రదాయాలు పూర్తిగా అంధవిశ్వాసాలు కావు

సంప్రదాయాలను పాటించడం అంటే అవన్నీ పూర్తిగా అంధవిశ్వాసాలు కావు. అవి తల్లి-శిశు ఆరోగ్యాన్ని రక్షించే వ్యవస్థ. ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ , వైద్య సలహాలను కూడా పాటించాలి. బాలింత చీపురు తాకొద్దు అనేది ప్రసవం తర్వాత ఆమె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఓ భాగం. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది...తద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుందన్నదే అసలు ఆంతర్యం.

వంట నుంచి సైన్స్ కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam