Priyanka Chopra Daughter Malti Marie Latest Video: హీరోయిన్లు అంటే మోడ్రన్ మహిళలు అని పలువురిలో అభిప్రాయం ఉంటుంది. సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వరని అంటారు.
వృత్తిపరంగా మోడ్రన్‌గా కనిపించడం వేరు... మనిషి లోపల భక్తి ఉండటం వేరు అని ప్రియాంకా చోప్రా ప్రూవ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ తాజాగా షేర్ చేసిన వీడియో చూస్తే ఎవరైనా ఆ మాటే అంటారు. అమ్మాయి మాలతీ మేరీకి మంగళ శ్లోకాలు నేర్పిస్తున్నారు ప్రియాంకా చోప్రా.
సర్వ మంగళ మాంగళ్యే...
అమ్మాయితో కలిసి దుర్గ సప్తశతి!
సౌండ్ ఆన్ చేసి వీడియో చూడమని సోమవారం రాత్రి (ఆగస్టు 2, 2026న) ఇన్‌స్టాలో ప్రియాంకా చోప్రా ఓ వీడియో షేర్ చేశారు. ''నాలో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి... మామ (అంటే అమ్మ). రెండు... మామసీటా (సరదా మనిషి)'' అని వీడియోపై క్యాప్షన్ ఇచ్చారు.
వీడియోలో ఏముంది? అనే విషయానికి వస్తే... మొదట అమ్మాయి మాలతీ మేరీ చోప్రా జోనాస్ (Malti Marie Chopra Jonas)తో కలిసి మంగళ శ్లోకం చదువుతూ కనిపించారు. ఆ తర్వాత వెస్ట్రన్ మ్యూజిక్ ప్లే అవుతుంటే స్నేహితుల మధ్య డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రియాంకా చోప్రాలో రెండు పర్సనాలిటీస్ చూశారు ప్రేక్షకులు. అయితే... అందులో భారతీయులకు ఎక్కువగా నచ్చినది మాత్రం మొదట మంగళ శ్లోకమే.
'సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే...
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే'
- ఇదీ అమ్మాయి మాలతీతో కలిసి ప్రియాంక చెప్పిన శ్లోకం. ఆ వీడియోలో ఒక్క లైన్ మాత్రమే ఉంది. కానీ, పూర్తి శ్లోకం ఇది.
దేవీ మాహాత్మ్యం (దుర్గ సప్తశతి)లోని ప్రసిద్ధ మంగళ శ్లోకంలో ఒక భాగాన్ని ప్రియాంకా చోప్రా చదివారు. అమ్మాయికి నేర్పిస్తున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఆషాడ మాసం. కానీ, ఉత్తరాది సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం వచ్చింది. అక్కడ గౌరీ పూజలు చేస్తుంటారు. అందులో భాగంగా అమ్మాయికి శ్లోకాన్ని నేర్పినట్టు ఉన్నారు. అదీ సంగతి.
అమెరికన్ సింగర్ అండ్ హజ్బెంబ్ నిక్ జోనాస్ (Nick Jonas), కుమార్తె మాలతీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి జూలైలో హైదరాబాద్ వచ్చారు ప్రియాంకా చోప్రా. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ 'వారణాసి'లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మందాకినీ పాత్ర పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన ప్రియాంక.. మధ్యలో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో ఓ సినిమా చూశారు.
Author : S Niharika

