Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PV Sindhu Temple Device : పీవీ సింధుకు ఏమైంది? ఆ నొసటిన ఉన్న పరికరం ఏంటీ?

PV Sindhu Temple Device : పీవీ సింధుకు ఏమైంది? ఆ నొసటిన ఉన్న పరికరం ఏంటీ?

ABP దేశం 1 month ago

PV Sindhu Temple Device : డెన్మార్క్ తూర్పు తీరంలోని హార్సెన్స్ నగరంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే థామ్, ఉబెర్ కప్లపైనేకాకుండా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఆటపైనే కూడా చాలా మంది దృష్టి ఉంది.

దీనికి తోడు ఆమె ధరించిన పరికరం ఏంటనే ఆసక్తి చాలా మంది కలిగింది. ఆమె నొసటిపై ధరించిన ఆ చిన్న డివైజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఏంటీ టెంపుల్ డివైజ్

సింధు ధరించిన పరికరాన్ని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ డెవలప్ చేశారు. దీనికి టెంపుల్ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక అంగుళం పొడవు ఉంటుంది. ఇందులో బ్లూటూత్ సాంకేతిక ఉండదు. బ్యాటరీ సామర్థ్యంతో ఒకసారి ధరిస్తే 3 నుంచి 4 గంటలపాటు పని చేస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం పరీక్ష దశలో ఉంది. మార్కెట్లోకి అమ్మకానికి అందుబాటులో లేదు.

ఈ పరికరం క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఇది ప్లేయర్ల నొసటి భాగంలో రక్తప్రసరణ పర్యవేక్షిస్తుంది. దీంతో కాగ్నీషన్, ఏకాగ్రత అభివృద్ధిని రియల్ టైంలో పర్యవేక్షించే వీలు ఉంది. ప్లేయర్ల శరీరంలో జరిగే మార్పులను ఇది డేటా రూపంలో అందిస్తుంది.

ఉబెర్ కప్లో తన మొదటి మ్యాచ్లో సింధు డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్ను ఎదుర్కొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 21-13, 18-21,21-17తో విజయం సాధించారు. మూడోగేమ్లో 12-15తో వెనుకబడిన సింధు తర్వాత పుంజుకొని విజయం సాధించారు. ఈ పరికరం ఎంత వరకు విజయంపై ప్రభావం చూపిందో సమీక్ష చేయాల్సి ఉంది.

ఈ టెంపుల్ పరికరం పరీక్షలు విజయవంతం అయితే ఇది కేవలం బ్యాడ్మింటన్కే పరిమితం కాకుండా ఇతర క్రీడల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam