Dailyhunt
Raaka First Look : నా 18 ఏళ్ల డ్రీమ్... ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే - రాకా ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్

Raaka First Look : నా 18 ఏళ్ల డ్రీమ్... ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే - రాకా ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్

ABP దేశం 6 days ago

Director Atlee Reaction About Raaka First Look : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ 'AA22xA6' మూవీ సర్ప్రైజ్ ఫ్యాన్స్‌కు నిజంగానే ఫుల్ ట్రీట్ ఇచ్చింది.

తోడేలు చేయి, గుండుతో బన్నీ ఫెరోసియస్ లుక్ క్షణాల్లోనే ట్రెండ్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఓ ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్‌పై అట్లీ తాజాగా స్పందించారు.

18 ఏళ్లుగా...

రాకా కేవలం ఒక సినిమా మాత్రమే కాదని... తాను ఎన్నో ఏళ్లుగా మోస్తున్న ఓ భాగమని చెప్పారు అట్లీ. 'ఇది నేను ఎన్నో ఏళ్లుగా నాలో మోస్తున్న ఒక భాగం. 18 ఏళ్లుగా ఒకే ఆలోచనను వదలకుండా, దాన్ని మసక బారనివ్వకుండా పట్టుకున్నా. అది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. అన్నింటిలోనూ నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్' అంటూ రాసుకొచ్చారు.

Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?

ప్రీ పోస్టర్‌తోనే బిగ్ హైప్ క్రియేట్ చేయగా... బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో ఆ హైప్ మరింత పెంచేశారు. సమాంతర ప్రపంచం, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా... ఒక్క లుక్‌తోనే ఓ విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. మూడు జనరేషన్స్‌లో మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన లుక్ రాక్షసుడి రూపంలో ఓ నెగిటివ్ రోల్‌కు సంబంధించినదని తెలుస్తోంది.

అసలేంటీ 'రాకా'

టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉండడంతో అసలేంటీ రాకా అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాకా అంటే ఫినిష్ లాంగ్వేజ్‌లో 'రా' లేదా బ్రూటల్ అని అర్థం. ఫస్ట్ లుక్ సరిగ్గా గమనిస్తే బన్నీ నుదుటిపై చిన్న చిన్న గాయాలున్నాయి. దీన్ని బట్టి యుద్ధ భూమిలో గాయపడ్డ సింహం శక్తి పుంజుకుని మళ్లీ తిరిగి వచ్చినట్లు చూపించారు.

ప్రజల కోసం ఓ వారియర్‌గా మారిన వ్యక్తిని రా ఫోర్స్ అని అనవచ్చు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఓ యోధుడిగా కనిపించనున్నారా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరో పరంగా చూస్తే... 'రాకా' అంటే పూర్ణిమ, పున్నమి చంద్రుడు అని అర్థం. చీకట్లను తరిమి వెలుగులు నింపే శక్తిగానూ దీన్ని పరిగణిస్తారు.

ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ స్థాయిలో రాకా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam