Producer Allu Aravind ABout Rajamouli : మగధీర... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. చిరుతతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్...
రెండో మూవీ మగధీరతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఈ మూవీకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా... గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మించారు.
దాదాపు రూ.40 కోట్ల నుంచి - రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మూవీ వరల్డ్ వైడ్గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్, రాజమౌళితో సినిమా చేయడం గురించి నిర్మాత అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు.
'ఈ రేంజ్కు వెళ్తారనుకోలేదు'
రాజమౌళి ఈ రేంజ్కు వెళ్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అల్లు అరవింద్ తెలిపారు. 'రాజమౌళి అప్పుడు ఇప్పుడు స్టార్ డైరెక్టర్. అప్పట్లో డైరెక్టర్గా ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయనతో మూవీ చేయాలనుకున్నా. ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. దానికి తోడు నాకు నా మేనల్లుడు చరణ్తో మూవీ చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉండేది.
చరణ్ ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత మూవీకి నేను ప్రొడ్యూసర్. నా మేనల్లుడికి నేను నిర్మాతగా బిగ్ హిట్ ఇవ్వాలని అనుకున్నా. అదే నా లక్ష్యం. అందుకే రాజమౌళిని ఎంచుకున్నా. భారీ బడ్జెట్ కేటాయించా.' అని తెలిపారు.
Also Read : 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
వారు నా ఫేవరెట్ డైరెక్టర్స్
ప్రస్తుతం మాస్, యాక్షన్, ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో అప్పటి స్టార్ డైరెక్టర్ కె విశ్వనాథ్ జానర్ మూవీస్ చేసేందుకు తాను రెడీగా ఉంటానని చెప్పారు అల్లు అరవింద్. 'ప్రస్తుతం అలాంటి జానర్ తీసే అలా ఊహించే డైరెక్టర్స్ లేరు. కె విశ్వనాథ్, బాలచందర్, బాపు వారు నా ఫేవరెట్ డైరెక్టర్స్. వీరు తీసే మూవీస్ ఇప్పటికీ అందరి హార్ట్ను టచ్ చేేసేలా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు.
ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేసేందుకు నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. స్టార్స్తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే అందరూ మూవీస్ ఇష్టపడతారు. బలగం లాంటి బ్యాక్ డ్రాప్ మూవీలో స్టోరీ, ఎమోషన్స్తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది.' అని తెలిపారు.
Also Read : 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?
Also Read : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
Author : Ganesh Guptha

