Dailyhunt
Rakasa OTT : ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Rakasa OTT : ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

ABP దేశం 1 week ago

Rakasa Biker Movie OTT Release Platform Locked : యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ డ్రామా రాకాస. శుక్రవారం (ఏప్రిల్ 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

అప్పుడే ఓటీటీ రిలీజ్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'రాకాస' మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత 4 నుంచి 6 వారాల మధ్యలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే రెండో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్, నయన్లతో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల మూవీని నిర్మించారు.

Also Read : భర్తను పరిచయం చేసిన తమన్నా సింహాద్రి - బిగ్ బాస్ ఫేం ట్రాన్స్ జెండర్ ఇన్ స్టా పోస్ట్ వైరల్

స్టోరీ ఏంటంటే?

అనగనగా ఒక ఊరి కోటలో తిష్ట వేసిన రాక్షసుడు. వందల ఏళ్లకు ఒకసారి నిద్ర లేచే రాక్షసుడు మూడు సంకేతాలు పంపుతాడు. అలా మూడో వార్నింగ్ వచ్చినప్పుడు ఊరంతా ఒకరిని సెలక్ట్ చేసి ఆ కోటలోకి బలి కోసం పంపాలి. అలా చేస్తేనే ఊరికి మంచి జరుగుతుందని... లేకుంటే బ్రహ్మ రాక్షసుడి చేతిలో ఊరి నాశనం తప్పదని గ్రామస్థుల నమ్మకం. వీరబాబు అలియాస్ వీరు (సంగీత్ శోభన్) తన లవర్ కోసం అమెరికా నుంచి ఊరికి వస్తాడు. అప్పటికే ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి తన ఫ్రెండ్ బాలు (గెటప్ శ్రీను)తో కలిసి ఆ పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటాడు.

ఇందులో భాగంగానే తన చిన్న నాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను కలుస్తాడు. ఫైనల్గా వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే, ఊహించని రీతిలో వీరు కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. మరి కోటలోకి వెళ్లిన వీరు తిరిగొచ్చాడా? తమ ఫ్రెండ్ను కాపాడుకునేందుకు బాలు, సుబ్బలక్ష్మి ఏం చేశారు? ఊరి కోటలో రాక్షసుడి చరిత్ర ఏంటి అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

'బైకర్' మూవీ కూడా...

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శర్వా సరసన మాళవికా నాయర్ హీరోయిన్. శర్వా తండ్రిగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ పూర్తైన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

స్టోరీ ఏంటంటే?

సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్కు గుర్తింపు దక్కాలని తపన పడుతుంటాడు. ఎంతోమంది రేసర్లను తీర్చిదిద్దుతాడు. ఆయన తనయుడు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) కు కూడా అతనే కోచ్. తండ్రి కల నెరవేర్చేందుకు అంతర్జాతీయ రేసింగ్లో పాల్గొంటాడు. అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్తో రేసింగ్కు దూరమవుతాడు విక్కీ.

ఈ నిర్ణయం తండ్రీ కొడుకుల మధ్య దూరం పెంచుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రేసింగ్లోకి రావాలని విక్కీ నిర్ణయించుకుంటాడు. అసలు తండ్రికి దూరంగా రేసింగ్ వదిలేయడానికి కారణం ఏంటి? మళ్లీ విక్కీ రేసింగ్ కోసం ఎందుకు వచ్చాడు? విక్కీ లైఫ్లోకి వచ్చిన అనన్య (మాళవిక నాయర్) ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam