Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?

ABP దేశం 1 week ago

Ram Charan's Bodyguard Kevin Kunta Background Details : సెలబ్రిటీలకు ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం కామన్. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట మాత్రం వెరీ స్పెషల్.

పెద్ది ప్రమోషన్స్లో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా చరణ్ అపాయింట్ చేసుకున్నాడు. గత 4 రోజులుగా కెవిన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలు అతనెవరు? బ్యాగ్రౌండ్ ఏంటో ఓసారి చూస్తే...

ఆఫ్రికన్ ఫైటర్

ఇటీవల పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరగ్గా చరణ్ పర్సనల్ బాడీ గార్డ్ కెవిన్ కుంట అందరి దృష్టిని ఆకర్షించాడు. చరణ్ సెక్యూరిటీ కాక ముందే ఆయన చాలా ఫేమస్. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ అసలు పేరు 'అబ్డౌ సోవే'. బాడీగార్డుగా మారక ముందే ఆయన బాక్సర్గా డిఫరెంట్ పోరాటం చేశాడు. ప్రపంచానికి అతనెవరో తెలియక ముందే రెజ్లింగ్లో సత్తా చాటాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన కష్టం, శ్రమ, డిసిప్లిన్తో ఎదిగాడు.

ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో ఎమ్ఎమ్ఏ ఫైటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీలో మిడిల్ వెయిట్ ఛాంపియన్గా ఎన్నో రికార్డులు సాధించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన, తనను తాను మలుచుకున్న తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కే బాడీ గార్డ్గా అతను ప్రపంచానికి పరిచయమయ్యాడు.

Also Read : Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్

రోజుకు ఎంత ఛార్జ్ చేస్తారంటే?

బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా రియల్ లైఫ్లో సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ స్థాయి వీఐపీలకు సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్గా కెవిన్కు భారీ డిమాండ్ ఉంది. పెద్ది ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యే వారకూ చరణ్ కెవిన్ను బాడీ గార్డ్గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు ఆయనకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఫీజు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ ఇప్పటివరకూ తమ సెక్యూరిటీ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారనే ప్రచారం ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్కి రూ.15 లక్షలు ఇస్తుండగా... బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ ఏడాదికి రూ.3 కోట్లు సంపాదిస్తాడని టాక్. కన్నడ స్టార్ యశ్ తన బాడీగార్డ్కు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ విషయంలో రోజుకు పే చేస్తున్నది నిజమైతే ఇది రికార్డనే చెప్పాలి.

Also Read : Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్లో బిగ్ సర్ప్రైజ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam