Prabhas Fans Slams Om Raut After Watching Ramayana Teaser : నితీశ్ తివారి రామాయణ టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
శ్రీరాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లుక్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓం రౌత్‌పై విమర్శలు
ఇదే టైంలో ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో మళ్లీ మీమ్స్ పేలుతున్నాయి. రామాయణ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... రణబీర్ లుక్ వేరే లెవల్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఒకవేళ, ఆది పురుష్‌లో శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ ఇలానే ఉంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేవంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి కటౌట్‌కు ఇలాంటి విజువల్స్ తోడై ఉంటే ఇండియన్ రికార్డ్స్ ఏవీ మిగిలేవి కావని అంటున్నారు.
ప్రభాస్‌ను రణబీర్‌లా చూపిస్తే బాగుండేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం రణబీర్ లుక్ మాత్రమే కాకుండా విజువల్స్, VFXను సైతం కంపేర్ చేస్తున్నారు. పుష్పకవిమానం అంటే రామాయణ టీజర్ క్లైమాక్స్‌లో చూపించేదిగా ఉంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. అంత బడ్జెట్ పెట్టి మరీ ఆడియన్స్ అంచనాలను ఓం రౌత్ అందుకోలేకపోయారంటూ కొందరు సెటైరికల్‌గా ట్వీట్స్ చేస్తున్నారు.
VFXపై భిన్నాభిప్రాయాలు
కొందరు రామాయణ VFXపై ప్రశంసలు కురిపిస్తుంటే... మరికొందరు మాత్రం ఆదిపురుష్ కంటే కాస్త పర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇవి AI జనరేటెడ్ విజువల్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. శ్రీరాముడిగా రణబీర్ లుక్, అయోధ్య, వనవాసం, రావణుడితో వార్ వంటి అంశాలను అద్భుతంగా ఈ వీడియోలో చూపించారు. టీజర్ క్లైమాక్స్‌లో వచ్చే పుష్పక విమానం ఫ్రేమ్ నిజంగా గూస్ బంప్సే. మొత్తానికి ఓ హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ కన్ఫర్మ్ అని మాత్రం ఈ వీడియోతో తేలిపోయింది.
Also Read : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
ప్రస్తుతం రామాయణ టీజర్ వైరల్ అవుతోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ దీపావళికి సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Author : Ganesh Guptha<

