Dailyhunt
Ramayana Cast Remuneration : నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ - రణబీర్, సాయి పల్లవి, నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే?

Ramayana Cast Remuneration : నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ - రణబీర్, సాయి పల్లవి, నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే?

ABP దేశం 2 weeks ago

Ramayan Movie Cast Remunerations : అటు సోషల్ మీడియా నుంచి ఇటు యూట్యూబ్ వరకూ ప్రస్తుతం రామాయణ టీజర్ ట్రెండ్ అవుతోంది. రాముడిగా రణబీర్ కపూర్ లుక్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

అయోధ్య, అరణ్య వాసం, రామ రావణ వార్ సీక్వెన్స్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మైథలాజికల్ ఎపిక్లో నటించే వారి రెమ్యునరేషన్స్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

ఈ మూవీలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతమ్మ వారిగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా రామాయణ తెరకెక్కుతుండగా... రణబీర్ కపూర్ ఒక్కో పార్ట్ కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. రణబీర్ గత సినిమాల కంటే ఇది చాలా ఎక్కువ. బ్రహ్మాస్త్ర కోసం రూ.25 కోట్లు - రూ.30 కోట్లు. ఇక బ్లాక్ బస్టర్ యానిమల్ కోసం రూ.30 కోట్లు - రూ.35 కోట్లతో పాటు లాభాల్లో షేర్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

తన డ్యాన్స్, అందం, అభినయంతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్గానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. దక్షిణాది ప్రాజెక్టుల కంటే రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. రామాయణ ఒక్కో పార్ట్ కోసం రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రాంఛైజీ మొత్తానికి రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఆమె లాస్ట్గా నటించిన తండేల్ సినిమాకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె కెరీర్లోనే ఇదే హయ్యెస్ట్.

Also Read : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్

రామాయణలో రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్నారు. రెండు భాగాలకు ఈయన రూ.100 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. కేజీఎఫ్ ప్రాంచైజీ కోసం యశ్ రూ.30 నుంచి రూ.35 కోట్లు వసూలు చేశాడు. ఇక హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు సన్నీ డియోల్ మొత్తంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

లక్ష్మణుడి రోల్ చేస్తున్న టీవీ స్టార్ రవి దూబే రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు టాక్. ఇది ఫైనల్ కాకపోయినప్పటికీ ఆయన కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్.

ఏఆర్ రెహమాన్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... దాదాపు రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అంతే కాకుండా లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తోన్న రామాయణ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రెండో పార్ట్ వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam