Producer Namit Malhotra Rejects Ramayana Big OTT Deal : ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ రామాయణ. నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ ఎపిక్లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు.
రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రెండు పార్టులుగా ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్
ఈ మూవీ రెండు పార్టుల డిజిటల్ రైట్స్ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.1,000 కోట్ల డీల్ ఆఫర్ చేసిందట. అయితే, దీన్ని నిర్మాత నమిత్ రిజెక్ట్ చేశారట. ఓటీటీ డీల్ విషయంలో రెండు పార్టులను వేర్వేరు ప్లాట్ ఫామ్స్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... మొదటి ఫస్ట్ పార్ట్ డీల్ ఫిక్స్ అయిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి రెండో పార్ట్ డీల్ కుదుర్చుకోనున్నారట. రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్కు కూడా మేకర్స్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు.
Also Read : నాలుగు వేల కోట్ల బడ్జెట్తో రామాయణ - రణబీర్, సాయి పల్లవి, నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే?
డ్యూయల్ రోల్లో రణబీర్
ఈ మూవీలో శ్రీరాముడితో పాటు మరో రోల్లోనూ రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా వెల్లడించారు. రామాయణలో పరశురాముడి పాత్రను కూడా పోషిస్తున్నట్లు చెప్పారు రణబీర్. 'శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడు. ఈ సినిమాలో శ్రీరాముడితో పాటు పరశురాముడిగానూ నటించే ఛాన్స్ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా.
ఇలాంటి మైథలాజికల్ మూవీస్లో నటించేటప్పుడు బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు. ఆ పాత్రల వెనుక ఉన్న ఆధ్యాత్మికత, భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రామాయణ చిత్రీకరణకు ముందు ఏడాది పాటు ఆ పాత్రల గురించి బాగా తెలుసుకున్నా. రాముడిగా ముందు నటించేందుకు అంగీకరించకపోయినా నా బిడ్డ పుట్టిన తర్వాత ఆలోచన విధానం మారింది.' అని తెలిపారు.
రిలీజ్ ఎప్పుడంటే?
గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా... గూస్ బంప్స్ తెప్పిస్తోంది. శ్రీరాముడిగా రణబీర్ లుక్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. విజువల్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాగా... ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయి. ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్ రిలీజ్ కానుంది.
ఈ మూవీలో సీతమ్మగా సాయి పల్లవి... రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కౌశల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మంధరగా షీబా చద్దా రాణి నటిస్తున్నారు. దాదాపు 10 వేల మంది టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. సీతమ్మ వారు, రావణుడి లుక్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
Author : Ganesh Guptha

