Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్

Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్

ABP దేశం 1 week ago

Rao Bahadur Actress Deepa Thomas Emotional Speech : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ముఖ్యంగా డిఫరెంట్ రోల్స్‌లో విభిన్న గెటప్పుల్లో సత్యదేవ్ నటనపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ సక్సెస్‌తో టీం ఫుల్ జోష్‌లో ఉంది. శనివారం సత్యదేవ్ బర్త్ డే కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరోయిన్ దీప థామస్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

'నా పేరెంట్స్ గర్వపడ్డారు'

రావు బహదూర్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు దీప థామస్. ఈ మూవీలో ఆమె నర్స్ రేణుక పాత్రలో నటించారు. సత్యదేవ్ నటనతో పాటు పేరెంట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. 'ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో సత్యదేవ్ ఒకరు. రావు బహదూర్‌లో డిఫరెంట్ రోల్స్‌లో ఆయన యాక్టింగ్ అద్భుతం. ఆయనతో కలిసి వర్క్ చేయడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాకు ఆయనకు కచ్చితంగా అవార్డు వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు.

Also Read : Hang Man OTT : ఓటీటీలో బ్రహ్మాజీ 'హ్యాంగ్ మ్యాన్' - ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

'నమ్మలేకపోయా... అదే బెస్ట్ కాంప్లిమెంట్'

తాను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 9 ఏళ్లయిందని... ఇలాంటి గొప్ప ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో కలలు కన్నట్లు చెప్పారు దీప. ''కేరాఫ్ కంచరపాలెం' లాంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు మహా ఒక రోజు నాకు ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా ఆడిషన్ కోసం ప్రొఫైల్ పంపమన్నప్పుడు నన్ను నేను నమ్మలేకపోయా. రావు బహదూర్ సినిమాలో భాగం కావడమే నా జీవితంలో అత్యంత హ్యాపీయెస్ట్ డే. నాకు రేణుక పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకటేశ్‌కు రుణపడి ఉంటాను.

థియేటర్లలో ఒక్కో సీన్‌కు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమాలో కామెడీ మూమెంట్ వస్తే నవ్వుతున్నారు. ఎమోషనల్ మూమెంట్ వస్తే ఏడుస్తున్నారు. ప్రతీ ఎమోషన్‌కు కనెక్ట్ అవుతున్నారు. మా పేరెంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు సబ్ టైటిల్స్‌తో మూవీ చూశారు. ఈ మూవీ చూసి మా నాన్న 'కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ చేశావు' అని మెచ్చుకుంటే... నా జీవితంలో అత్యంత విలువైన కాంప్లిమెంట్ ఇది.' అంటూ ఎమోషనల్ అయ్యారు.

'కేరాఫ్ కంచరపాలెం' ఫేం వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన మూవీలో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read : Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam