Rohit Naidu Patnam: బిగ్ బాస్ 10 తెలుగు ప్రధాన షోలోకి కామనర్స్ ఎంట్రీ ఇవ్వడానికి నిర్వహించే ప్రీ షో 'అగ్నిపరీక్ష'. కఠినమైన టాస్క్‌లతో కామనర్స్‌ను పరీక్షిస్తున్నారు.
టాప్ 15 కామనర్స్‌లో టఫ్ ఫైట్ ఇస్తున్న వారిలో విజయవాడకు చెందిన రోహిత్ నాయుడు పట్నం ఒకరు.
రియల్ లైఫ్
రోహిత్ నాయుడు ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తి. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్‌ఫ్లూయెన్సర్‌గా పనిచేస్తున్నాడు. మోడలింగ్, యాక్టింగ్ పట్ల ఉన్న ఆసక్తితో బిగ్ బాస్ కామనర్ కాంటెస్ట్ 'అగ్నిపరీక్ష'లో పాల్గొన్నాడు.
సోషల్ మీడియా
రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో (@rohitnaidupatnam.official) చాలా యాక్టివ్‌గా ఉంటూ రీల్స్, షార్ట్స్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను షేర్ చేస్తుంటాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎంట్రీతో ఇతనికి నెట్టింట ఫాలోయింగ్ భారీగానే పెరిగింది.
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' టాస్క్‌లు
అగ్నిపరీక్ష షోలో జడ్జిలు (అభిజిత్, బిందు మాధవి, నవదీప్) పెట్టే కఠినమైన టాస్క్‌లలో రోహిత్ పాల్గొన్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అతడిని సపోర్ట్ చేస్తూ ఓట్లు వేస్తున్నారు. బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో వీడియోలు చేసే క్రియేటర్లు కూడా రోహిత్ ను సపోర్టు చేస్తున్నారు. అగ్నిపరీక్ష ఎపిసోడ్‌లో జడ్జిగా ఉన్న బిందు మాధవి పేషెన్స్ టాస్క్‌లో రోహిత్ ముఖంపై రెండు మూడు సార్లు నీళ్లు కొట్టి రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, అతడు ఎలాంటి ఆవేశం చూపించకుండా చాలా సైలెంట్‌గా, కూల్‌గా ఉన్నాడు. ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు, నీ ఆత్మగౌరవం కోసం ప్రశ్నించు అని శ్రీముఖి అడిగినప్పుడు "నన్ను రెచ్చగొట్టేందుకే అలా చేస్తున్నారేమో" అని రోహిత్ సమాధానమిచ్చాడు.
'ఆటో' రాంప్రసాద్.. జబర్దస్త్ పంచ్‌ల రాజా.. కెరీర్ విశేషాల నుంచి బిగ్ బాస్ ఎంట్రీ వరకు!
రెడ్ vs గ్రీన్ కార్డ్
రోహిత్ మరీ సాఫ్ట్‌గా ఉంటున్నాడని, గొడవలకు లేదా తన అభిప్రాయం చెప్పడానికి స్టాండ్ తీసుకోవడం లేదని భావించి బిందు మాధవి, నవదీప్ రెడ్ కార్డ్ ఇచ్చారు. అయితే, అభిజిత్ మాత్రం "ప్రతీ దానికి రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదు, కూల్‌గా ఉండటం మంచిదే, కాకపోతే మున్ముందు నీలోని వేరే వేరియేషన్స్ చూపించాలి" అని గ్రీన్ కార్డ్ ఇచ్చి అతడిని 'హోల్డ్' లో పెట్టాడు.
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
ఓటింగ్
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాస్క్‌లు పూర్తి చేసి, జడ్జిల నుంచి 'హోల్డ్' సాధించిన కామనర్ కంటెస్టెంట్లలో రోహిత్ ఒకడిగా నిలిచాడు. ఈ అగ్నిపరీక్షలో ఎంపికైన కామనర్లని ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా లేదా బిగ్ బాస్ టీమ్ తుది నిర్ణయం ద్వారా బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి పంపించే అవకాశం ఉంది.
"నా చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని విడిచి వెళ్లినప్పుడు, జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ఎన్నో కష్టాలను, బాధ్యతలను, నా బలాన్ని పరీక్షించే పరిస్థితులను ఎదుర్కొన్నాను. మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక పాఠం నేర్పింది. ఏం జరిగినా సరే, నిన్ను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు. ఆ మాటలే నాకు బలంగా మారాయి. దృఢంగా నిలబడటం, ప్రతి పోరాటంలో పోరాడటం, ముందుకు సాగుతూ ఉండటం అవి నాకు నేర్పించాయి. ఈ రోజు, నేను నేర్చుకున్న ప్రతి పాఠాన్ని, ప్రతి పోరాటాన్ని, ప్రతి త్యాగాన్ని గర్వంగా మోస్తున్నాను. జీవితం సులభంగా ఉండడం వల్ల నేను ఇక్కడ లేను. నాపై నాకు ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోనందువల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇది నా ప్రయాణం. ఇది నా అగ్నిపరీక్ష. ఇది రోహిత్ నాయుడు" అని అగ్నిపరీక్ష స్టార్టింగ్‌లో రోహిత్ చెప్పాడు.
ఎవరీ షాలిని పటేల్?.. బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్!
Author : Satyaprasad Bandaru

