Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Royal Enfield Bullet 350 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI వివరాలు

Royal Enfield Bullet 350 350 ఆన్-రోడ్ ధర ఎంత? రూ.10000 చెల్లిస్తే నెలవారీ EMI వివరాలు

ABP దేశం 1 week ago

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 భారత్లో చాలా కాలం నుంచి ప్రజలకు అత్యంత ఇష్టమైన బైకులలో ఒకటి. దీని క్లాసిక్ డిజైన్, పవర్ఫుల్ రోడ్ ప్రెజెన్స్, ప్రత్యేక గుర్తింపు కారణంగా ఈ బైక్ను యుత్తో పాటు పెద్దవారు కూడా ఎంతగానో ఇష్టపడతారు.

మీరు ఈ బైక్ను కొనాలంటే ఒకేసారి పూర్తి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, లోన్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకును సొంతం చేసుకోవచ్చు.

ఫైనాన్స్, EMIపై కొనుగోలు చేయాలనుకుంటే, వాహనం డౌన్ పేమెంట్ ఎంత, బ్యాంక్ లోన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. మీరు కూడా Bullet 350 కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే, హైదరాబాద్ ఈ బైక్ ఆన్-రోడ్ ధర ఎంత, కొనుగోలు చేయడానికి ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో పూర్తి లెక్కలను మీకు అందిస్తున్నాం.

బుల్లెట్ 350 బైక్ ఆన్-రోడ్ ధర ఎంత?

Royal Enfield Bullet 350 బెటాలియన్ బ్లాక్ మోడల్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్లో సుమారు రూ. 2 లక్షలు (2,13,622)గా ఉంది. అయితే, వేర్వేరు నగరాల్లో ఆన్-రోడ్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం. ఒకవేళ మీ వద్ద బైక్ పూర్తి ధరను ఒకేసారి చెల్లించడానికి ఫుల్ పేమెంట్ లేకపోతే, దాదాపు రూ. 10,000 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రూ. 2.13 లక్షల ఆన్-రోడ్ ధర ఉన్న Bullet 350 కోసం దాదాపు రూ. 2 లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు.

వడ్డీ రేటు సంవత్సరానికి 9.5 శాతంగా అనుకుంటే, 5 సంవత్సరాల లోన్ కాలవ్యవధిలో ప్రతి నెలా దాదాపు రూ. 5000 EMI చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం గడువు వరకు వడ్డీ 96,738 చెల్లిస్తారు. మీరు లోన్ వ్యవధిని 4 సంవత్సరాలకు తగ్గిస్తే, నెలవారీ EMI రూ.5800కు పెరుగుతుంది. 3 సంవత్సరాల లోన్ కోసం నెలకు ఈఎంఐ రూ.7,268 అవుతుంది.

టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

7000 EMI లెక్కన చూస్తే, కొనుగోలుదారుడి జీతం నెలకు కనీసం రూ. 30,000 వరకు ఉండాలి. ఇంటి ఇతర ఖర్చులకు డబ్బులు ఉండాలి. బైక్ కొనుగోలు చేసే ముందు కేవలం డౌన్ పేమెంట్, EMI లెక్కలు వేసుకుంటే సరిపోదు. పెట్రోల్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు నిరంతరం ఉంటాయి. ఇవి కాకుండా బైక్ను ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, పెట్రోల్ ఖర్చు పెరగవచ్చు.

కొనేముందు క్రెడిట్ స్కోర్ తనిఖీ చేయండి

మీరు Bullet 350ని EMIపై కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే, మీ క్రెడిట్ స్కోర్ తనిఖీ చేసుకోవడం మంచిది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంక్ నుంచి మెరుగైన లోన్ ఆఫర్ పొందవచ్చు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల వడ్డీ రేట్లను కూడా పోల్చి చూశాకే నిర్ణయం తీసుకోవాలి..

మీరు Royal Enfield Bullet 350 కొనుగోలు చేయాలనుకుంటే, కేవలం బైక్ ధరను చూసి మాత్రమే బడ్జెట్ను నిర్ధారించుకోకండి. సుమారు రూ. 2 లక్షల ఆన్-రోడ్ ధర ఉన్న మోడల్కు దాదాపు రూ. 10,000 డౌన్ పేమెంట్ మరియు సుమారు రూ. 2 లక్షల లోన్ 9.5 శాతం వడ్డీ రేటుతో 2 సంవత్సరాల లోన్కు ప్రతినెలా EMI దాదాపు రూ. 10,090 చెల్లించాలి.

ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్లోనూ తిరుగేలేదు

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam