Royal Enfield Launches New Heritage Apparel Collection: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) కేవలం బైకుల తయారీలోనే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తన ముద్రను వేస్తోంది. బ్రాండ్ కు ఉన్న 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను సెలబ్రేట్ చేస్తూ తాజాగా 'హెరిటేజ్ కలెక్షన్' (Heritage Collection) పేరుతో ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ అప్పారెల్ శ్రేణిని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
గతంలో ఉన్న పాతకాలపు ఆర్కైవల్ డిజైన్ ఎలిమెంట్లను నేటి తరం మెటీరియల్స్ తో కలిపి ఈ దుస్తులను తయారు చేశారు. ఇవి అటు బైక్ రైడర్లకే కాకుండా, సిటీలో స్టైలిష్ గా కనిపించాలనుకునే ఫ్యాషన్ ప్రియులకు కూడా నచ్చేలా ఉన్నాయి.
డిజైన్ ఫిలాసఫీ..
సిటీ కోసం తయారైనవి.. చరిత్ర నుంచి సంగ్రహించినవి (Built for the city, rooted in history) అనే కాన్సెప్ట్ తో ఈ కలెక్షన్ రూపొందింది. కాటన్ ట్విల్స్, కాన్వాస్ బ్లెండ్స్, స్ట్రెచ్ మెటీరియల్స్ వంటి నాణ్యమైన బట్టలను ఉపయోగించడం వల్ల ఇవి రోజంతా ధరించినా చాలా కంఫర్ట్ గా ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మెకానికల్ మూలాలను గుర్తుచేస్తూనే, ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా వీటిని డిజైన్ చేశారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉండేలా ఈ బట్టలను కుట్టడం విశేషం.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ T4.. బడ్జెట్ కింగ్ ఎవరు? పవర్ ఫుల్ బైక్ ఏది?
చారిత్రక చిహ్నాల కలయిక..
ఈ కలెక్షన్ లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. బ్రాండ్ కు ఉన్న ఐకానిక్ హిస్టారికల్ లోగోలను చాలా పద్ధతిగా ఉపయోగించడం. ఎక్కడో పెద్దగా బ్రాండింగ్ కనిపించకుండా, దుస్తుల ఫినిషింగ్ లో చరిత్రను నిక్షిప్తం చేశారు. 1910 నాటి కానన్ లోగో, 1893 లో ప్రాచుర్యం పొందిన "మేడ్ లైక్ ఏ గన్" (Made Like a Gun) స్లోగన్, అలాగే 1969 నాటి సిరీస్ II ఇంటర్సెప్టర్ ట్యాంక్ బ్యాడ్జ్ వంటి వాటిని ప్రింట్లు, ఎంబోసింగ్ పద్ధతుల్లో వాడారు. కలర్ ప్యాలెట్ విషయానికి వస్తే.. మ్యూటెడ్, ఎర్తీ కలర్స్ అంటే గోధుమ, ఆలివ్ గ్రీన్ వంటి సహజమైన రంగులను ఎంపిక చేశారు. దీనివల్ల పాతకాలపు లుక్ రావడంతో పాటు నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటుంది.
తొలి ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించనున్న రాయల్ ఎన్ఫీల్డ్.. 154 కి.మీ రేంజ్తో త్వరలో మార్కెట్లోకి
కంపెనీ మాటల్లో..
రాయల్ ఎన్ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ..శతాబ్ద కాలం పైగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ వారసత్వాన్ని ఈ హెరిటేజ్ కలెక్షన్ ద్వారా దుస్తుల రూపంలో కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు. వాడిన ఫ్యాబ్రిక్ నుండి లోగోల వరకు ప్రతిదీ బ్రాండ్ ప్రయాణాన్ని గుర్తుచేస్తుందని, ఇవి కేవలం గతాన్ని గుర్తు చేసే దుస్తులు మాత్రమే కాదని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్చిన ఆధునిక రూపాలు. హస్తకళా నైపుణ్యం, నాణ్యతను కోరుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలిపారు.
రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650కి గట్టి పోటీ! ఏప్రిల్ 23న భారత్లో బీఎస్ఏ స్క్రాంబ్ల్ 650 లాంచ్!
రాయల్ ఎన్ఫీల్డ్ కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ అని భావించే అభిమానులకు ఈ హెరిటేజ్ రేంజ్ ఒక గొప్ప అవకాశం. రోజువారీ జీవితంలో కూడా బ్రాండ్ వారసత్వంతో ముడిపడి ఉండేలా ఈ దుస్తులు డిజైన్ చేశారు. రైడింగ్ జాకెట్లు, టీ-షర్టులు, ఇతర యాక్సెసరీలతో ఈ కలెక్షన్ మార్కెట్లో సందడి చేస్తోంది. పాత జ్ఞాపకాలను ఆధునిక ఫ్యాషన్ తో కలిపి ధరించాలనుకునే వారు వీటిని రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్లలో చెక్ చేయవచ్చు.
Author : Ayesha

