Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Samantha: సోనీలివ్ తమిళ్ కోసం సమంత ప్రాజెక్ట్... సామ్ జామ్ తరహాలో మరో టాక్ షో?

Samantha: సోనీలివ్ తమిళ్ కోసం సమంత ప్రాజెక్ట్... సామ్ జామ్ తరహాలో మరో టాక్ షో?

ABP దేశం 4 months ago

Samantha Latest News In Telugu: సమంత జీవితంలో 2026 చాలా మెమరబుల్ అని చెప్పాలి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో గతేడాది డిసెంబర్ నెలలో ఆమెకు వివాహమైంది.

ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమాకు ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళు వచ్చాయి. ఆ సినిమా విడుదలైన వెంటనే సమంత ప్రెగ్నెంట్ అని తెలిసింది. బ్యాక్ టు బ్యాక్ ఆమె జీవితంలో సంతోషాలు నెలకొన్నాయి. అయితే... గర్భవతి కావడంతో సమంత కొంత విరామం తీసుకుంటారని భావించారంతా. కానీ, ఆమె ఓటీటీలో వీక్షకులు, అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

సోనీలివ్ ఓటీటీ కోసం సమంత టాక్ షో?
సమంత మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారా? కొత్త టాక్ షో చేసే ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గతంలో 'ఆహా' ఓటీటీ కోసం 'సామ్ జామ్' (Sam Jam) చేశారు సమంత. ఆ టాక్ షో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో... టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె టాక్ షో హోస్ట్ చేసేందుకు సమంత రెడీ అవుతున్నట్లు సమాచారం.

''సమంతతో కలిసి సంథింగ్ స్పెషల్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం. త్వరలో ఆ డీటెయిల్స్ మీ అందరితో పనుకోవాలని ఉంది'' అని సోనీలివ్ తమిళ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దానిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు. ఈ టాక్ షో తమిళంలో రూపొందించనున్నారని సమాచారం. అందులో ఇంగ్లీష్, ముఖ్యంగా తమిళ భాషలో సమంత మాట్లాడనున్నారు. సమంత హోస్ట్ అయితే సెలబ్రిటీలతో ఆమె ఏం మాట్లాడారు? ఎటువంటి ముచ్చట్లు పెట్టారు? అని తెలుసు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read:Peddi OTT Release Date - పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్లాన్ చేసిన సమంత?
ఇప్పుడు సమంత ప్రెగ్నెంట్. గర్భవతిగా ఉన్న సమయంలో ఎక్కువ వర్క్ చేయకూడదు. గర్భంలో శిశువును దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి. సినిమా లేదా వెబ్ సిరీస్ చూస్తే... షూటింగ్ సమయంలో ఒత్తిడి ఉంటుంది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అంటే కాస్త కష్టపడాలి ఉంటుంది. టాక్ షో అయితే సరదాగా సోఫాలో కూర్చుని మాట్లాడుకోవచ్చు. అందుకని సమంత ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

సోనీలివ్ తమిళ్ ఓటీటీ కోసం సమంత చేయబోయే టాక్ షో షెడ్యూల్ విషయంలో ఇప్పటికీ కొంత సందిగ్ధత నెలకొంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు టాక్ షో చేస్తారా? లేదంటే డెలివరీ తర్వాత చేస్తారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam