Lavanya Tripathi's Sathi Leelavathi Trailer Reaction : మెగా కోడలు, యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'.
తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇంతకీ అల్లుడెక్కడ?
భార్యాభర్తల మధ్య అలకలు, చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన ట్రైలర్... నవ్వులు పూయిస్తూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది. '20 ఏళ్ల నా పెంపకంలో కనిపించని నీ నువ్వు మూడేళ్ల మీ సంసార జీవితంలో చూశానమ్మా... ఇంతకీ అల్లుడెక్కడ?' అనే ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దంపతుల మధ్య మూడో వ్యక్తి వస్తే జరిగే పరిణామాలేంటి?, అందమైన అబ్బాయికి గయ్యాళి లాంటి భార్య వస్తే పరిస్థితి ఏంటి? భర్తను కట్టేసి భార్య ఎందుకు కొట్టింది?

