Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

ABP దేశం 1 week ago

Hair Oiling Tips : జుట్టుకు నూనె రాయడం అనేది తరతరాలుగా వస్తున్న అలవాటు. అయితే చాలామందికి తెలిసినది ఏంటంటే.. జుట్టుకు నూనె రాయడం అంటే కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు ఫుల్​గా రాయడమే.

కానీ కొందరు జుట్టుకు కాదు.. స్కాల్ప్కి నూనె రాయాలి అంటారు. మరికొందరు స్కాల్ప్​కి కాదు.. జుట్టు పొడవునకే రాయాలి అంటారు. ఈ రెండింటిలో ఏది నిజం? జుట్టు సమస్యను బట్టి నూనె రాయాలా? ఎలా అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో చూసేద్దాం.

స్కాల్ప్ ఆయిలింగ్ బెనిఫిట్స్

స్కాల్ప్ ఆయిలింగ్ అంటే తల చర్మానికి నేరుగా నూనె అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయడం. ఇది జుట్టు కుదుళ్లను పోషించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల పొడిగా ఉండే స్కాల్ప్, దురద వంటి సమస్యలు తగ్గి స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. సున్నితంగా మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్కు రక్తప్రసరణ మెరుగై జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.

Also Read : అవిసె గింజలు జెల్ తలకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే.. ఇలా తయారు చేసి, అలా అప్లై చేసేయండి

మాడుకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రిలాక్స్గా అనిపించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొబ్బరి నూనె, బాదం నూనె, భృంగరాజ్ ఆయిల్ వంటి నూనెల్లో ఉండే పోషకాలు కుదుళ్లకు మేలు చేస్తాయి. తల చర్మం బాగా పొడిగా ఉండే వారు స్కాల్ప్​కి నూనె పెట్టడం మంచిది. ఆయిలీ స్కాల్ప్, చుండ్రు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఎక్కువసేపు నూనె ఉంచకుండా వైద్యుల సూచన మేరకు మాత్రమే ఉపయోగించాలి.

హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్

హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ అంటే స్కాల్ప్​కి అప్లై చేయకుండా కేవలం జుట్టుకు పొడవునకు మాత్రమే నూనె రాయడం. ఇలా జుట్టు చివర్ల వరకు ఆయిల్ అప్లై చేస్తే.. పొడిబారిన జుట్టుకు తేమ అందుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం తగ్గే అవకాశం ఉంటుంది. జుట్టు చిట్లిపోవడం, ఎగిరిపోవడం తగ్గి సాఫ్ట్గా కనిపిస్తుంది. నూనె వల్ల జుట్టు క్యూటికల్ స్మూత్గా మారి సహజమైన మెరుపు వస్తుంది. స్టైలింగ్ టూల్స్, సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

మీ జుట్టుకు ఏది అవసరం?

మీకు పొడి స్కాల్ప్, దురద ఉంటే.. నూనెను మాడునకు అప్లై చేయడం మంచిది. మీ జుట్టు పొడిబారిపోయి, ఫ్రిజ్జీగా, స్ప్లిట్ ఎండ్స్ ఉంటే.. హెయిర్ స్ట్రాండ్ ఆయిలింగ్ ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. స్కాల్ప్ ఆయిలీగా ఉండి జుట్టు మాత్రం డ్రైగా ఉంటే.. తల చర్మానికి నూనె రాయకుండా జుట్టు చివర్లకు మాత్రమే నూనె అప్లై చేయడం మంచిది. కర్లీ హెయిర్ ఉన్నవారు.. స్ట్రాండ్ ఆయిలింగ్ ద్వారా జుట్టు తేమను ఎక్కువసేపు నిలుపుకోవచ్చు.

Also Read : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

నూనె రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నూనెను జుట్టుకు వారానికి 1 లేదా 2 సార్లు నూనె రాస్తే చాలామందికి సరిపోతుంది. గోరువెచ్చని నూనెతో 5 నుంచి 10 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. రాత్రంతా నూనె ఉంచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు అలా చేయకూడదు. ఎక్కువ మొత్తంలో నూనె రాయడం కూడా మంచిది కాదు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam