Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?

ABP దేశం 1 month ago

Hidden Dangers of Doomscrolling Risks : ఈరోజుల్లో సోషల్ మీడియా చాలా మందికి రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం మొదలుకొని..

రాత్రి పడుకునే వరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, షార్ట్ వీడియోలు చూస్తూ గంటల కొద్ది సమయాన్ని గడిపేస్తుంటారు. చాలామంది దీన్ని టైంపాస్గా భావించినా.. నిపుణుల ప్రకారం ఇది కొన్ని మానసిక, శారీరక సమస్యలకు సంకేతం కావొచ్చు.

డోపమైన్

సోషల్ మీడియాలో ప్రతి నోటిఫికేషన్, లైక్, వీడియో, కొత్త పోస్టు అనేది మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ విడుదల అయ్యేలా చేస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ ఫోన్ చూడాలనే కోరిక పెరుగుతుంది. ఇదే క్రమంగా అలవాటుగా మారి.. డూమ్ స్క్రోలింగ్ చేస్తారు. ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితికి దారితీస్తుంది.

ఒత్తిడి, ఒంటరితనం

చాలామంది స్ట్రెస్, ఆందోళన, ఒంటరితనం, బోర్ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ తాత్కాలికంగా రిలాక్స్ అయినట్లు అనిపించినా.. ఎక్కువసేపు స్క్రోల్ చేయడం వల్ల మానసిక అలసట మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

నిద్రపై ఎఫెక్ట్

రాత్రి పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును యాక్టివ్గా ఉంచి నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో మేల్కొనడం వంటి సమస్యలు రావచ్చు.

ఏకాగ్రత లోపం

చిన్న చిన్న వీడియోలు, వేగంగా మారే కంటెంట్ను నిరంతరం చూడడం వల్ల మెదడు ఎక్కువసేపు ఒక పనిపై ఫోకస్ చేయడం కష్టమవుతుంది. చదువు, పని, రోజువారీ పనుల్లో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

కాన్ఫిడెన్స్ తగ్గుతుంది..

సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి తమ జీవితంతో పోల్చుకునే అలవాటు చాలా మందిలో పెరుగుతోంది. దీంతో ఆత్మవిశ్వాసం తగ్గడం, అసంతృప్తి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

శారీరక సమస్యలు

గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని ఫోన్ చూడడం వల్ల మెడ నొప్పి, కంటి అలసట, తలనొప్పి, చేతి నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే..

సోషల్ మీడియా వల్ల పని, చదువు, నిద్ర, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఈ వ్యసనాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, పదే పదే నోటిఫికేషన్స్ చెక్ చేయడం, స్క్రీన్ టైమ్ తగ్గించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం.

ఎలా కంట్రోల్ చేయాలి?

రోజుకు ఎంతసేపు సోషల్ మీడియా వాడాలో టైమ్ లిమిట్ పెట్టుకోవాలి. పడుకునే ముందు కనీసం ఒక గంట ఫోన్ దూరంగా పెట్టాలి. అవసరం లేని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. వ్యాయామం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం వంటి అలవాట్లు పెంచుకోవాలి. అవసరమైతే డిజిటల్ డిటాక్స్ ప్రయత్నించాలి.

సోషల్ మీడియా పూర్తిగా చెడు కాదు. కానీ నియంత్రణ లేకుండా వాడితే అది మానసిక ఆరోగ్యం, నిద్ర, ఏకాగ్రత, వ్యక్తిగత జీవితంపై నెగిటివ్​గా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam