Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెకండ్‌హ్యాండ్‌ EV కొనేవారికి గుడ్‌న్యూస్ - బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌తో అందుబాటులోకి MG ఎలక్ట్రిక్ కార్లు

సెకండ్‌హ్యాండ్‌ EV కొనేవారికి గుడ్‌న్యూస్ - బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌తో అందుబాటులోకి MG ఎలక్ట్రిక్ కార్లు

ABP దేశం 1 week ago

How To Buy An Used Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌ను మరింత విశ్వసనీయంగా మార్చేందుకు ఎంజీ మోటార్ ‍ఇండియా (MG Motor India) కీలక నిర్ణయం తీసుకుంది.

సెకండ్‌హ్యాండ్‌ కార్ల విక్రయ వేదిక అయిన స్పిన్నీ (Spinny)తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా... సర్టిఫైడ్ ప్రి ఓన్డ్ MG ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు & విక్రయం మరింత సులభం కానుంది.

ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్ EV కొనుగోలులో వినియోగదార్లను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే అంశాలు - బ్యాటరీ హెల్త్, మిగిలిన బ్యాటరీ సామర్థ్యం, వాహనం అసలు విలువ & భవిష్యత్తులో పనితీరు. ఈ సందేహాలకు పరిష్కారం చూపడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ఎంజీ మోటార్ & స్పిన్నీ వెల్లడించాయి.

బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌
ఈ ఒప్పందం ప్రకారం స్పిన్నీ తన నెట్‌వర్క్‌లో ప్రత్యేక EV తనిఖీ విధానాన్ని అమలు చేయనుంది. ఎంజీ మోటార్ సాంకేతిక సహకారంతో బ్యాటరీ హెల్త్‌ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికేట్ జారీ చేయనుంది. దీంతో వాహనం కొనుగోలు చేసే వారికి బ్యాటరీ స్థితిపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. విక్రేతలకు కూడా వాహనం విలువను పారదర్శకంగా నిర్ణయించే అవకాశం లభిస్తుంది.

: EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్‌తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే

మొదటి దశలో... హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, కొచ్చి, ముంబై, పుణే, జైపూర్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, చండీగఢ్ & కోయంబత్తూరు నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. తరువాత ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు MG Comet EV, MG Windsor EV & MG ZS EV వంటి సర్టిఫైడ్ ప్రి ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లను స్పిన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా ఈ కంపెనీ కార్ హబ్‌ల ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. అలాగే తమ వాహనాలను విక్రయించాలనుకునే వారు కూడా ఇదే వేదికను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్‌లో విక్రయానికి వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ కారుపై 200 పాయింట్ల సమగ్ర తనిఖీని నిర్వహిస్తారు. బ్యాటరీ స్థితితో పాటు వాహనం మొత్తం పనితీరును పరిశీలించిన తర్వాత మాత్రమే విక్రయానికి అనుమతిస్తారు. అలాగే కంపెనీ వారంటీ కొనసాగింపు, ఫిక్స్‌డ్ ప్రైస్ విధానం & కొనుగోలు చేసిన తర్వాత ఐదు రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

: మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లోకి వస్తున్న నిస్సాన్ టెక్టాన్ - ఈ 13వ మోడల్‌ నుంచి ఏమేం ఆశించవచ్చు?

స్పిన్నీ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిస్టోరేషన్ సెంటర్లలో ఈ కార్లను ప్రత్యేకంగా రీకండిషన్ చేయనున్నారు. ఇందుకోసం ఆధునిక EV డయాగ్నస్టిక్ పరికరాలు, బ్యాటరీ రిస్టోరేషన్ టెక్నాలజీతో ఈ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో సెకండ్‌హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా కొత్త కార్ల మాదిరిగా నాణ్యత ప్రమాణాలు అందుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో కొత్త తరం ఎనర్జీ వాహనాల విస్తరణకు విశ్వసనీయమైన సెకండ్‌హ్యాండ్ మార్కెట్ కూడా ఎంతో కీలకం - ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా

బ్యాటరీ డయాగ్నస్టిక్స్‌లో పారదర్శకత తీసుకురావడం ద్వారా సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌పై వినియోగదారుల విశ్వాసం మరింత పెరుగుతుంది - స్పిన్నీ వ్యవస్థాపకుడు & CEO నీరజ్ సింగ్

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో ఇప్పటివరకు బ్యాటరీ హెల్త్ ప్రధాన సందేహంగా ఉండేది. ఇప్పుడు ఎంజీ మోటార్ & స్పిన్నీ భాగస్వామ్యంతో ఆ భయాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌కు కొత్త ఊపు రావడంతో పాటు మరింత మంది వినియోగదారులు ధైర్యంగా ఎలక్ట్రిక్ కార్లను ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Author : Arun Kumar Veera

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam