Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!

శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!

ABP దేశం 1 week ago

 సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేశామని చెప్పారు ఈవో ఎం.శ్రీనివాసరావు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం స్పర్శ దర్శనం ఉండదన్నారు.

శని, ఆది, సోమవారాల్లో రాత్రివేళ స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు.

మిగిలిన రోజుల్లో యథావిధిగా 3 పూటలు స్పర్శ దర్శనాలు కొనసాగుతాయన్నారు. శ్రావణమాసంలో శుక్రవారం రాత్రిపూట స్పర్శ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.

సిఫార్స్ లేఖల అధికారిక లెటర్ హెడ్‌లను 2 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలన్నారు. సిఫార్సు లేఖలను protocal@srisailadevasthanam.org కి పంపించాలని సూచించారు. సిఫార్సు లేఖలను ప్రోటోకాల్​ వాట్సాప్​ నెంబర్​ 9160016215 కు పంపించవచ్చని తెలిపారు.

భారీగా తరలివచ్చే సామాన్య భక్తులకు సర్వ దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా సులభంగా దర్శనం చేసుకునేందుకు ఈ మార్పులు చేశామని చెప్పారు

శ్రీశైలం ఆలయంలో శ్రావణమాసం ప్రత్యేక ఏర్పాట్లగురించి తెలుసుకునేందుకు దేవస్థానం వెబ్ సైట్ లేదా మానమిత్ర వాట్సాప్ సేవను సందర్శించండి

image 6

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam