Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?

Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?

ABP దేశం 1 month ago

Singeetham Srinivasa Rao's Sing Geetham Teaser Out Now : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.

ఇండస్ట్రీలోనే సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మూకీ చిత్రం 'పుష్పక విమానం', 'విచిత్ర సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజు', 'ఆదిత్య 369' ఇలా ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టి సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మ్యూజికల్ ఫాంటసీ 'సింగ్ గీతం'

'సింగ్ గీతం' అనే డిఫరెంట్ టైటిల్‌తో మ్యూజికల్ ఫాంటసీగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. 'కుబేరపురం... ఓ మిస్టీరియస్ విలేజ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. 'అసలెందుకు వదిలేసి వెళ్లిపోయాడంకుల్ మా నాన్న ఈ ఊరిని. రాజా ట్రీట్మెంట్ ఇక్కడ...' అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్... గ్రామంలో జరిగే ఫన్నీ ఇన్సెడెంట్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ప్రతాప్ అనే యువకుడి చుట్టూ ఈ కథ సాగుతుండగా... అనుకోని మార్గంలోకి వెళ్లిన యువకునికి ఎదురైన సవాళ్లు, ఇబ్బందులు ఏంటి? సరికొత్త ప్రపంచంలో సదరు యువకుడు ఏం తెలుసుకున్నాడు. అనేదే స్టోరీ.

ఈ మూవీలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేవతి, అమృతం ఫేం నారిపెద్ది శివన్నారాయణ, బెనర్జీ, అగు స్టాన్లీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam