అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ సముద్ర విహారం చేశారు. బోటులో వెళ్తూ నేచర్ ఎంజాయ్ చేశారు.
బోటులో సముద్ర మధ్యలోకి వెళ్లి సీ డైవింగ్ చేశారు.
సముద్ర గర్భంలో చేపలు, రాళ్ల ఫోటోలను కెమెరాలో బంధించారు.
శోభిత సీ డైవింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు.
సముద్రం మధ్యలో అలల సవ్వడిలో నేచర్ అందాలు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. దీన్ని ఓ మంచి జ్ఞాపకంగా వర్ణించారు శోభిత.
శోభిత రీసెంట్‌గా చీకటిలో అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నారు.

