Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Spirituality: ఒక్క మాత్రతో 8 రకాల సమస్యలకు ఉపశమనం, 8 వరాలు మీ సొంతం!

Spirituality: ఒక్క మాత్రతో 8 రకాల సమస్యలకు ఉపశమనం, 8 వరాలు మీ సొంతం!

ABP దేశం 4 days ago

శ్లోకం

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్

ఒక్క శ్లోకం చాలు.. ఆంజనేయుడు ప్రసాదించే 8 వరాలు మీసొంతమవుతాయి

1. బుద్ధి: - Brain Power

ఆంజనేయుడికి గురువు సూర్య భగవానుడు. సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు లంకలో సీతాదేవి జాడ కనిపెట్టినవాడు, రావణుడి సభకు దూతగా వెళ్లినవాడు , సంజీవని తీసుకొచ్చినవాడు అయిన హనుమంతుడిని కష్టసమయంలో తల్చుకుంటే చాలు ధైర్యం అదే వచ్చేస్తుంది. పరీక్షల సమయంలో అయినా, ఉద్యోగం కోసం ఇంటర్యూలకు వెళ్లే సమయంలో అయినా, నిర్ణయం తీసుకునేందుకు కష్టంగా ఉన్నాసరే.. అలాంటి సమయంలో హనుమాన్ స్మరణతో మైండ్ పదునుగా పనిచేస్తుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది

2. బలం - Body Power, Will Power

కొండని పెకిలించి చేతపట్టుకుని సముద్రాన్ని దాటినవాడు, రామకార్యం కోసం అడుగు వెనక్కు వేయనివాడు అయిన ఆంజనేయుడిని తల్చుకుంటే అంతర్గత బలం మీ సొంతం. ఏ పని అయినా సాధించగలను అనే ధైర్యం వచ్చేస్తుంది

3. యశః - Glory and Honor

ఆంజనేయుడి పేరు చెబితేనే రాక్షసులు వణికిపోతారు, భక్తులు పొంగిపోతారు. నీపని నువ్వు నిజాయితీగా చేసినప్పుడు భయం ఎందుకు? అప్పుడు నీకు రావాల్సిన కీర్తి, గౌరవం రాకుండా ఎలా ఆగిపోతాయ్? పేరు , కీర్తి, గౌరవం కోసం నువ్వు పరిగెత్తకు..నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించినప్పుడు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. హనుమంతుడు పేరు సంపాదించుకోలేదు..తనపని తాను చేసుకుంటూ పోతే అదే వచ్చింది.

4. ధైర్యం - Courage

లంక మొత్తం రాక్షసులున్నా ఒక్కడే వెళ్లాడు హనుమంతుడు. భయం ఎక్కడైనా కనిపించిందా? లేదు..ఎందుకంటే తన వెనుక రాముడున్నాడు అనే ధైర్యం. ఏ కార్యం తలపెట్టినా నా వెనుక రాముడున్నాడు లేదా ఆంజనేయుడున్నాడు లేదంటే నా ఇష్టదైవం ఉందనే నమ్మకంతో అడుగు ముందుకువేయండి..భయం మీ దరిదాపులకు కూడా రాలేదు

5. నిర్భయత్వం - Fearlessness

ధైర్యం వేరు, నిర్భయత్వం వేరు. ధైర్యం అంటే భయం ఉన్నప్పటికీ ఎదురించడం.. నిర్భయత్వం అంటే భయం లేకుండా పోరాడడం. ఆంజనేయుడిని స్మరిస్తే ఎలాంటి భయం అయినా పటాపంచలు అయిపోతుంది. దుష్టగ్రహాలు వెనుతిరిగిచూడకుండా పారిపోతాయ్. జై హనుమాన్ అనే పిలుపుచాలు భయం మిమ్మల్ని చేరుకునేందుకు భయపడుతుంది..

6. అరోగతా - Absence of Disease

ఆంజనేయుడు చిరంజవి..వాయుపుత్రుడు..సంజీవని తీసుకొచ్చిన వైద్యుడు. అందుకే హనుమాన్ ని తల్చుకుంటే ఆరోగ్యం ఇస్తాడు. మానసిక రోగాల నుంచి ముఖ్యంగా డిప్రెషన్, ఆంగ్జైటీ సహా అన్ని రోగాలు తగ్గి శరీరం , మనసు ఆరోగ్యంగా ఉంటుంది

7. అజాఢ్యం - Lack of Laziness

జాడ్యం అంటే మందకొడితనం, సోమరితనం, వాయిదావేసే తత్వం.. హనుమంతుడు ఈ రోజు చేయాలి అనుకున్న పనిని క్షణం కూడ ఆలస్యం చేయడు. రాముడి ఆజ్ఞ అనగానే తనకు సాధ్యం అవుతుందా లేదా అనే చూడకుండా సముద్రాన్ని లంఘించాడు. ఏ పని అయినా రేపు చేద్దాం అనే వాయిదా రోగం వదలాలంటే వాయుపుత్రుడిని తల్చుకోవాలి. వేకువజామునే నిద్రలేవాలి..అప్పుడే బద్ధకం పారిపోతుంది.

8. వాక్పటుత్వం - Speech Power

సీతాదేవితో, రాముడితో, రావణుడితో.. వ్యక్తిని బట్టి, సందర్భం ఆధారంగా ఎంతో చక్కగా మాట్లాడాడు ఆంజనేయుడు. మంత్రి, దూత, వక్త అన్నీ హనుమంతుడే. మీకు మాట్లాడాలంటే భయం ఉన్నప్పుడు, మాట తడబడినప్పుడు హనుమాన్ ని భక్తిపూర్వకంగా స్మరించుకుంటే మాటలు గంగాప్రవాహంలా వచ్చేస్తాయి

చిన్న శ్లోకమే కానీ ఇందులో 8 రకాల పవర్స్ ఉన్నాయి.

అంటే ఆంజనేయుడిని స్మరిస్తే చాలు బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం,చురుకుదనం, మాటకారికతనం అనే 8 గుణాలు మీ సొంత మవుతాయి.

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి నిద్రపోయే ముందు ఈ శ్లోకం 3 సార్లు చెప్పండి..పిల్లలతో చెప్పించండి

ఏ పని మొదలు పెట్టినా జై హనుమాన్ అని ప్రారంభించండి...ప్రతి అడుగులోనూ విజయం మీ సొంతం అవుతుంది

జై హనుమాన్...

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam