Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా సియెర్రా EV వేరియంట్‌లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవే.. మీ అవసరానికి సరిపడే కాంబినేషన్‌ ఏది?

టాటా సియెర్రా EV వేరియంట్‌లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవే.. మీ అవసరానికి సరిపడే కాంబినేషన్‌ ఏది?

ABP దేశం 1 week ago

Tata Sierra EV 2026 Battery Options: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, తన ఐకానిక్ SUVల్లో ఒకటైన సియెర్రాను పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

రూ.18.79 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన టాటా సియెర్రా EV... Nexon EV & Curvv EV కంటే ప్రీమియం స్థాయిలో నిలుస్తోంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, ఎక్కువ రేంజ్ కలిగిన బ్యాటరీ ఆప్షన్లతో ఈ SUV కార్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది.

రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ధరలో బెస్ట్‌ ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి టాటా సియెర్రా EV మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు, RWD & AWD డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. అయితే అన్ని వేరియంట్‌లలో అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో లేవు.

: 3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌ పూర్తి వివరాలు ఇవే!

పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు

63 kWh

75 kWh

75 kWh

ఎలక్ట్రిక్ మోటార్ల సంఖ్య

1

1

2

క్లెయిమ్‌ చేసిన రేంజ్‌ (MIDC)

565 kms

665 kms

624 kms

డ్రైవ్‌ట్రెయిన్

రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)

రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)

ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (AWD)

పవర్

238 PS

209 PS

209 PS (రియర్‌ మోటార్‌), 140 PS (ఫ్రంట్‌ మోటార్‌)

టార్క్

315 Nm

315 Nm

504 Nm

ఈ సెటప్‌తో తన విభాగంలో AWD ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ SUVగా టాటా సియెర్రా EV ప్రత్యేక గుర్తింపు పొందింది.

: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

వేరియంట్ల వారీగా బ్యాటరీ ప్యాక్‌లు

వేరియంట్‌

63 kWh

75 kWh

RWD

RWD

AWD

Pureఉందిలేదులేదు
Pure Sఉందిలేదులేదు
Adventureఉందిఉందిలేదు
Empoweredఉందిఉందిలేదు
Empowered Aలేదుఉందిఉంది

అన్ని వేరియంట్‌లలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను టాటా అందిస్తోంది. దీంతో నగరాల్లోనే కాకుండా హైవే ప్రయాణాల్లో కూడా బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

ఫీచర్లు
టాటా సియెర్రా EVలో మూడు 12.3 అంగుళాల డిస్‌ప్లేలతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. అలాగే, పానోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్‌తో కూడిన సౌండ్‌బార్, పవర్డ్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 540 డిగ్రీ కెమెరా, ESC, పార్కింగ్ సెన్సర్లు & ఉన్నత వేరియంట్‌లలో ADAS వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు అందించారు.

భారత మార్కెట్లో టాటా సియెర్రా EVకి Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, BYD Atto 3 ప్రధాన ప్రత్యర్థులు. రెట్రో స్టైలింగ్, ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ రేంజ్ & AWD సామర్థ్యాన్ని కోరుకునే వినియోగదారులకు టాటా సియెర్రా EV ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Author : Arun Kumar Veera

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam