Dailyhunt
Tamil Nadu Assembly Elections: ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా - మూడో స్థానంలోనే విజయ్ టీవీకే

Tamil Nadu Assembly Elections: ఎర్లీ ట్రెండ్స్ లో డీఎంకే హవా - మూడో స్థానంలోనే విజయ్ టీవీకే

ABP దేశం 1 week ago

Tamil Nadu Assembly Elections DMK lead: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రారంభ ట్రెండ్స్ అధికార డీఎంకే (DMK) కూటమికే స్పష్టమైన మొగ్గును చూపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో స్టాలిన్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళా కేంద్రిత పథకాలు ఓటర్లను ఆకర్షించాయని ప్రాథమిక విశ్లేషణలు చెబుతున్నాయి.

మరోవైపు, తమిళ రాజకీయాల్లో కీలక మార్పు తెస్తారని భావించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం, టీవీకే మెజారిటీ స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. విజయ్ వ్యక్తిగత చరిష్మా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ,సంప్రదాయ ఓటు బ్యాంకులను చీల్చడంలో విఫలమవ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఈ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ అభిమానులు తమ నాయకుడు కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని ఢీకొట్టడం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతారని భావించినా, అది సీట్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) రెండో స్థానంలో కొనసాగుతూ డీఎంకేకు గట్టి సవాలు విసురుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీవీకే చీల్చిన ఓట్లు ఏఐఏడీఎంకే అవకాశాలను దెబ్బతీశాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా, పూర్తి స్థాయి ఫలితాలు వస్తే తప్ప విజయ్ పార్టీ భవిష్యత్తు మరియు తమిళ రాజకీయాల్లో థర్డ్ ఫోర్స్ పరిస్థితిపై స్పష్టత వచ్చేలా లేదు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam