తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే మాస్టర్ మైండ్ ఈయనే! ఎవరీ కపిల్ సాహూ?
కొలత్తూరు షాక్, జెయింట్ కిల్లర్గా వీఎస్ బాబు
ఈ ఎన్నికల్లో అత్యంత సంచలనాత్మక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. 2011 నుంచి స్టాలిన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కానీ నేడు టీవీకే అభ్యర్థి వీఎస్బాబు ఆయనకు గట్టి పోటీని ఇచ్చి ఓడించారు. ఒకట్రెండు రౌండ్లలో తప్ప ఏ రౌండ్లో కూడా స్టాలిన్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు 8వేల ఓట్ల తేడాతో స్టాలిన్పై వీఎస్బాబు గెలుపొందారు.
75 ఏళ్ల వయసు ఉన్న వీఎస్ బాబు రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఆయన గతంలో డీఎంకే తరఫున 2006లో ఎమ్మెల్యేగా గెలిచారు. 7 ఫిబ్రవరి 2026న ఆయన టీవీకేలో చేరి, ఇప్పుడు తన మాజీ బాస్కే ఓటమి రుచి చూపించారు. ఆయన ఆస్తుల విలువ 3.7 కోట్లు.
52 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం? MGR తర్వాత విజయ్ "సమ్మోహన యోగం", దళపతి జాతకంలో 3 రహస్యాలను తెలుసుకోండి!
రాయపురంలో సంచలనం ఆటో డ్రైవర్ చేతిలో మాజీ మంత్రి ఓటమి
ఈ ఎన్నికల ఫలితాల్లో మరో అద్భుతమైన ఘట్టం రాయపురం నియోజకవర్గంలో ఆవిష్కృతమైంది. టీవీకే తరఫున పోటీ చేసిన ఒ సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ ధాము, అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి జయకుమార్ను ఓడించి సంచలనం సృష్టించారు. ఇక్కడ జయకుమార్కు డిపాజిట్ కూడా రాలేదు.