Dailyhunt
Tamil Nadu Election 2026 Results: తమిళనాడులో హంగ్ వస్తే.. బీజేపీ విజయ్‌తో చేతులు కలుపుతుందా ? నాగెంద్రన్ షాకింగ్ రిప్లై

Tamil Nadu Election 2026 Results: తమిళనాడులో హంగ్ వస్తే.. బీజేపీ విజయ్‌తో చేతులు కలుపుతుందా ? నాగెంద్రన్ షాకింగ్ రిప్లై

ABP దేశం 6 days ago

చెన్నై: తమిళనాడులో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈసారి నటుడు విజయ్ బరిలోకి దిగడంతో రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీతో ముక్కోణపు పోరు జరిగింది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తే.. విజయ్ పార్టీ ఓ మోస్తరు స్థానాలు సాధిస్తే పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది. హంగ్ వస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, నటుడు విజయ్ మద్దతు కోరుతుందని ప్రచారం మొదలైంది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ఆ ఊహాగానాల్ని కొట్టిపారేశారు. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదన్నారు. కన్యాకుమారిలో విలేకరులతో మాట్లాడుతూ, అభిప్రాయ సేకరణ, ఎగ్జిట్ పోల్స్పై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ప్రజల అసలు తీర్పు అందరికీ తెలుస్తుందని అన్నారు.

మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు

తాజా సర్వేల విశ్వసనీయతను బీజేపీ ఛీప్ నాగేంద్రన్ ప్రశ్నించారు. అధికార కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని, పక్షపాతధోరణి కనిపించిందన్నారు. ‘అభిప్రాయ సేకరణలు గతంలో కూడా నిజమైతే, నేను వాటిని నమ్ముతాను. చాలా చోట్ల చాలా మంది వారికి తోచిన అభిప్రాయాలు చెబుతున్నారు. ఇది డీఎంకే కూటమికి అనుకూల వైఖరి కనిపిస్తోంది. నేడు ప్రజల అసలు అభిప్రాయ సేకరణ తెలుస్తుంది. దాంతో గత 5 సంవత్సరాలుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం ఎలా ఉందో ఆ రోజు తెలుస్తుందని’ అన్నారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగగా, ఫలితాలు నేడు (మే 4న) వెలువడనున్నాయి. ఏప్రిల్ 29న విడుదలైన ఎగ్జిట్ పోల్స్, డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని సూచించాయి, అయితే కొన్ని అంచనాలు బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి అధికారం దక్కుతుందని సూచించాయి.

గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని నాగేంద్రన్ దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై సమాజంలోని వివిధ వర్గాల్లో అసంతృప్తి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందు అలా ఉంటే, దాని గురించి మాట్లాడవచ్చు. ఎన్నికల తర్వాత అలాంటి పరిస్థితి లేదు. అయితే, ప్రజలు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని బలంగా నమ్ముతున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు, మహిళలు, మధ్యతరగతి ప్రజల వరకు అందరూ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. టీవీకే పార్టీతో చర్చలు అంటున్నారు కదా.. అసలు విజయ్ ఏ నియోజకవర్గంలోనూ గెలిచే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయ్తో కూటమికి అవకాశం లేదు

అసెంబ్లీలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందా, ఎన్డీఏ విజయ్ మద్దతు కోరుతుందా అన్న ప్రశ్నలకు నాగేంద్రన్ ఘాటుగా బదులిచ్చారు. విజయ్ మెజారిటీ సాధించే అవకాశం లేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. దాని గురించి ఎలాంటి చర్చ లేదన్నారు.

కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు తుది ఫలితం కోసం ఎదురుచూస్తుండగా, దేశం మొత్తం అటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam