Dailyhunt
Tata Motors Launches Harrier and Safari: టాటా హారియర్, సఫారీ డీజిల్ వెర్షన్లలో కొత్త అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలు..

Tata Motors Launches Harrier and Safari: టాటా హారియర్, సఫారీ డీజిల్ వెర్షన్లలో కొత్త అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలు..

ABP దేశం 4 days ago

Tata Motors Launches Harrier and Safari Red Dark Edition: ఇండియన్ రోడ్లపై రారాజుల్లా వెలిగిపోతున్న టాటా హారియర్ (Harrier), టాటా సఫారీ (Safari) ఇప్పుడు మరింత స్టైలిష్గా మారిపోయాయి.

టాటా మోటార్స్ ఈ రెండు ఎస్యూవీల డీజిల్ వెర్షన్లలో 'అల్ట్రా' (Ultra) ట్రిమ్ తో పాటు 'రెడ్ డార్క్ ఎడిషన్' (Red Dark Edition) ను అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హారియర్ అల్ట్రా డీజిల్ మాన్యువల్ ధర రూ. 23.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అలాగే సఫారీ అల్ట్రా డీజిల్ మాన్యువల్ (7-సీటర్) ధర రూ. 24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు అన్ని టాటా డీలర్షిప్లలో లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు.

పెట్రోల్ నుంచి డీజిల్ కు అప్గ్రేడ్..
నిజానికి ఈ ఏడాది ఆరంభం వరకు అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్లు కేవలం పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ డీజిల్ వెర్షన్ కొనే కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఈ ఫీచర్లను డీజిల్ ఇంజిన్కు కూడా టాటా మోటార్స్ ఎక్స్టెండ్ చేసింది. దీనివల్ల రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లలోనూ టాప్-ఎండ్ ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి.

కళ్లు చెదిరే రెడ్ డార్క్ ఎడిషన్..
ఈ లాంచ్లో హైలైట్ అంటే రెడ్ డార్క్ ఎడిషన్ అనే చెప్పాలి. హారియర్ డీజిల్ మోడల్లో 'నిట్రో క్రిమ్సన్' (Nitro Crimson) ఎక్స్టీరియర్ పెయింట్ ఫినిషింగ్ చూడటానికి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీనికి తోడు బ్లాక్ కలర్ లో ఉన్న 19 అంగుళాల అలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ కారుకు ఒక స్పోర్టీ లుక్ ఇస్తాయి. హారియర్ లో ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ (Fearless X+), సఫారీలో అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ (Accomplished X+) ట్రిమ్స్ పైన ఈ కొత్త ఎడిషన్లు ఉంటాయి.

ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు..
కారు లోపలి భాగం 'కార్నెలియన్ రెడ్' (Carnelian Red) థీమ్తో చాలా విలాసవంతంగా ఉంటుంది. రెడ్ కలర్ లెదరెట్ సీట్లు లోపలి లుక్ ని మార్చేస్తాయి. టెక్నాలజీ పరంగా చూస్తే, ఇందులో 14.5 అంగుళాల హార్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీనికి శామ్సంగ్ నియో క్యూలెడ్ (Samsung Neo QLED) డిస్ప్లే వాడటం విశేషం. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ తో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అదనంగా, ఇన్-బిల్ట్ డ్యాష్క్యామ్ ఉన్న ఈ-ఐఆర్వీఎమ్ (E-IRVM), ఆటో రివర్స్ డిప్ ఫీచర్ ఉన్న మెమరీ ఓఆర్వీఎమ్స్, 65 వాట్ల టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ పవర్, సేఫ్టీ..
రెండు కార్లలోనూ 2.0 లీటర్ క్రయోజెట్ (Kryojet) టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ గురించి చెప్పాలంటే, భారత్ ఎన్క్యాప్ (Bharat NCAP) లో ఈ కార్లు 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన ఎస్యూవీలుగా పేరు తెచ్చుకున్నాయి. టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్స్ డీజిల్ ఎస్యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మీరు ఒక పవర్ఫుల్, స్టైలిష్ ఎస్యూవీ కోసం చూస్తుంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam