Dailyhunt
Tata Nexon Affordable Panoramic Sunroof SUV: టాటా మోటార్స్ సంచలన నిర్ణయం! 10 లక్షల మోడల్స్‌కే పనోరమిక్‌ సన్‌రూఫ్ ఫీచర్!

Tata Nexon Affordable Panoramic Sunroof SUV: టాటా మోటార్స్ సంచలన నిర్ణయం! 10 లక్షల మోడల్స్‌కే పనోరమిక్‌ సన్‌రూఫ్ ఫీచర్!

ABP దేశం 1 week ago

Tata Nexon Affordable Panoramic Sunroof SUV: భారతీయ వాహనదారుల మనసు గెలుచుకున్న మోడళ్లలో టాటా నెక్సాన్ ముందు వరుసలో ఉంటుంది. టాటా మోటార్స్ సంస్థ ఈ కారును కేవలం ఒక వాహనంగానే కాకుండా, మారుతున్న కస్టమర్ల అభిరుచుకులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముస్తాబు చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం వాహన ప్రియులు ఎక్కువగా కోరుకుంటున్న పనోరమిక్ సన్రూఫ్ ఫీచర్ను అత్యంత సరసమైన ధరకే అందించేందుకు టాటా సిద్ధమైంది. దీని కోసం ప్యూర్+పీస్ అనే కొత్త వేరియంట్ను కంపెనీ రంగంలోకి దించుతోంది.

10 లక్షలకే పనోరమిక్ సన్రూఫ్ కార్లు

ప్రస్తుతం టాటా నెక్సాన్లో పనోరమిక్ సన్రూఫ్ కావాలంటే కస్టమర్లు, క్రియేటివ్+ పీఎస్ వేరియంట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ. 11.32 లక్షగా ఉంది. అయితే కొత్తగా రాబోతున్న ప్యూర్+ఫీఎస్ వేరియంట్ ఈ ఫీచర్ను పది లక్షల లోపే అందించబోతోంది. ఈ కొత్త వేరియంట్ ధర సుమారు 9.49 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల పనోరమిక్ సన్రూఫ్ కలిగిన అత్యంత చౌకైన ఎస్యూవీగా నెక్సాన్ ఈ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించనుంది.

సన్రూఫ్నకు పెరుగుతున్న ఆదరణ క్యాష్ చేసుకుంటున్న టాటా

ప్రీమియం ఫీచర్లను కేవలం ఖరీదైన వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయకుండా సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్నదే టాటా మోటార్స్ ప్రధాన ఉద్దేశం. పనోరమిక్ సన్రూఫ్ పట్ల పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని, తక్కువ ధరకే ఈ ఫీచర్లను అందించడం ద్వారా నెక్సాన్ అమ్మకాలను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇది వాహనదారులకు గొప్ప విలువను అదించడమే కాకుండా, పోటీ సంస్థలకు గట్టి సవాలు విసరనుంది.

త్వరలో అందుబాటులోకి ప్యూర్ +పీఎస్ వేరియంట్

నెక్సాన్ లైన్ అప్లో ఈ కొత్త ప్యూర్ +పీఎస్ వేరియంట్ త్వరలోనే చేరుకనుంది. ఇది ప్రస్తుతం ఉన్న ప్యూర్+ఎస్, క్రియేటివ్ వేరియంట్ల మధ్యలో స్థానం పొందుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ప్యూర్+ఎస్ ర 9.23 లక్షలుగా క్రియేటివ 1.2 పెట్రోల్ ధర 9.99 లక్షలుగా ఉంది.

ఈవీ మోడల్స్లో కూడా సన్రూఫ్ ఫీచర్

నెక్సాన్ తన వైవిధ్యమైన ఇంజన్ ఆప్షన్లకు పేరుగాంచింది. ఈ కొత్త వేరియంట్ కూడా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వెర్షన్లో అందుబాటులోకి వస్తుందని అంచనా. అంతేకాకుండా, భవిష్యత్లో నెక్సాన్ ఈవీ మోడల్లో కూడా ఇదే తరహా సరసమైన పనోరమిక్ సన్రూఫ్ వేరియంట్ను ఆశించవచ్చు.

కారు మెయింటెనెన్స్లో ఈ టిప్స్ పాటిస్తే మీ జేబుకు చిల్లు పడదు.. భారీ రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి సింపుల్ గైడ్!

2017లో మొదటిసారిగా లాంచ్ అయిన టాటా నెక్సాన్, 2023లో తన రెండో ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసింది. ఈ అప్డేట్లో భాగంగా స్టైలింగ్, ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లలో సమూల మార్పులు వచ్చాయి. అప్పట్లో కేవలం సింగిల్ ఫేస్ సన్రూఫ్తో వచ్చిన ఈ కారులో అక్టోబర్ 2024లో పనోరమిక్ సన్రూఫ్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ ఫీచర్ ఉన్న వేరియంట్ల ధర రూ. 13.60 లక్షల నుంచి మొదలయ్యేది. కానీ జీఎస్టీ సవరణలు, కొత్త వేరియంట్ల చేరికతో ఇప్పుడు పది లక్షల లోపు ధరకే ఈ లగ్జరీ ఫీచర్ కస్టమర్ల దరికి చేరుతోంది.

వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్లలో ప్రీమియం లుక్

ప్రస్తుతం నెక్సాన్ మోడల్ కార్లు 7.37 లక్షల నుంచి 15.95 లక్షల ధరల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్, డిజిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఆరు ఎయిర్ బ్యాగ్ల వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్ల ప్రామాణికంగా ఉన్నాయి. ఈ కొత్త అప్డేట్తో నెక్సాన్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam