మీరు కనుక తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మీకు శుభవార్త. మీకు Tata Tiago EV బెస్ట్ ఛాన్స్ కావచ్చు.
జూలై 2026 లో ఈ కారుపై కంపెనీ తరపున భారీ డిస్కౌంట్ ఇస్తోంది. దీని ద్వారా కస్టమర్లు దాదాపు రూ. 1.45 లక్షల వరకు ఆదా ప్రయోజనాన్ని పొందవచ్చు. మొదటిసారిగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి, తక్కువ ధరలో మంచి కారు కోసం వెతుకుతున్న వారికి ఈ ఆఫర్ ప్రత్యేకం కానుంది.
ఈ ఆఫర్ కింద Tata Tiago EV ధర గతంలో కంటే చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపు అన్ని వేరియంట్లపై ఒకేలా లేదని గుర్తుంచుకోండి. వేర్వేరు మోడళ్లు, డీలర్షిప్ల ఆధారంగా ఇందులో కొద్దిగా వ్యత్యాసం కనిపించవచ్చు. ఈ కారుపై గరిష్టంగా దాదాపు రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభించవచ్చు. ఇది కారును తన సెగ్మెంట్లో తక్కువ ధరకు మారుస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు. హైదరాబాద్లో బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.7,29,553గా ఉంది.
కారు ప్రత్యేకతలు, రేంజ్
Tata Tiago EV ఒక ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్. దీనిని ప్రత్యేకంగా నగరాల్లో రోజువారీ నడిపేందుకు డిజైన్ చేశారు. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. మొదటిది 19.2 kWh బ్యాటరీ ప్యాక్, ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 200 నుండి 226 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. రోజువారీ ప్రయాణం తక్కువ దూరం ఉండే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుంది.
యమహా నుంచి త్వరలో కొత్త స్పోర్ట్స్ బైక్.. KTM RC200కు పెరిగిన పోటీ- YZF-R2 ప్రత్యేకతలివే
రెండవది 24 kWh బ్యాటరీ ప్యాక్. ఇది మరింత పవర్ఫుల్, దాదాపు 250 నుండి 285 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించే వారికి లేదా ఎక్కువ బ్యాకప్ కావాలనుకునే వారికి ఈ బ్యాటరీ వేరియంట్ సరిపోతుంది. రోజువారీ వాడకంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సిటీ డ్రైవింగ్ను దృష్టిలో ఉంచుకుని ఈ 2 బ్యాటరీ ఆప్షన్లను తయారు చేశారు.
కారు ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా టియాగో ఈవీ ఛార్జింగ్ విషయానికి వస్తే, DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో EVని కేవలం 35 నిమిషాల్లోనే 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. మీరు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక చిన్న బ్రేక్ సమయంలోనూ కారు చాలా శాతం వరకు ఛార్జ్ అయిపోయి.. మళ్లీ ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఫీచర్ దీనిని వాహనదారులకు సౌకర్యవంతంగా మారుస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో మోడ్రన్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, అనేక సేఫ్టీ ఫీచర్లు అందించారు. తక్కువ ధరలో కూడా ఇది ఒక మంచి, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చేలా టియాగో ఈవీని కంపెనీ డిజైన్ చేసింది.
Honda కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు
Author : Shankar Dukanam

