Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..

Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..

ABP దేశం 3 days ago

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. మంత్రి కొండా సురేఖ సైతం ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేసీ వేణుగోపాల్ సహా ఢిల్లీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చుకునే అవకాశాలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వైఖరిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నిబంధనలను అతిక్రమించడం, పార్టీకి భంగం కలిగించేలా ప్రవర్తించిన వీరిని పదవుల నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కుమార్తె అనుచిత వ్యాఖ్యలు, విమర్శలను కొండా సురేఖ దంపతులు ఖండించలేదు. కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నానికి బదులుగా తాము సుస్మితను ఎలా నియంత్రిస్తామంటూ కొండా మురళీ చేసిన చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. సుస్మిత ప్లాన్ ఏలో భాగంగా ఇలా కామెంట్ చేసి ఉండొచ్చునని, ప్లాన్ బీ ఏంటో తమకు తెలియదన్నారు. ఇంత జరిగినా పార్టీ నుంచి తీవ్ర విరమ్శలు వచ్చినా కొండా దంపతులు సుస్మిత వ్యాఖ్యలను తప్పుపట్టలేదు, కనీసం ఖండించకపోవడం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలకు కోపాన్ని తెప్పించి ఉండొచ్చు. దాంతో మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని, క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను సైతం ఆయన అధిష్ఠానం వద్ద ప్రస్తావించవచ్చు.

కొత్తవారికి అవకాశం కల్పించడం లేదా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియకు కొంత సమయం పట్టినా, సురేఖ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని పార్టీ నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించారని.. అందుకే నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు సురేఖపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సడలింపు నిమిత్తం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇన్ఛార్జి నుండి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం రేవంత్రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తప్ప, కొండా సురేఖను మంత్రివర్గం నుండి వేటు వేయడం దాదాపు ఖాయంగా మారనుంది.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నారు. విజయవాడ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అయి చర్చించనున్నారు. దీనితో పాటు వరంగల్ మామునూరు విమానాశ్రయం పనుల అభివృద్ధి పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని కలవనున్నారు. రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తోనూ సీఎం సమావేశం కానున్నారు. డిసెంబరు 7 నుండి 9 తేదీల్లో ఫ్యూచర్సిటీ వేదికగా నిర్వహించనున్నఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో పలు డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam