Thalapathy Vijay Sets Record After NTR MGR : యాక్టింగ్ టు పాలిటిక్స్... సినీ ఇండస్ట్రీలో ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండ్స్ పాలిటిక్స్లోనూ ప్రజల మనసులు గెలుచుకున్నారు.
పార్టీని స్థాపించిన తర్వాత తమదైన నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లి సీఎం పీఠం అధిరోహించారు. అలాంటి దిగ్గజాల సరసన టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు చేరిపోయారు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో పార్టీని స్థాపించి ఆటు పోట్లను ఎదుర్కొని అధికారం కైవసం చేసుకున్న దిగ్గజాలను ఓసారి గుర్తు చేసుకుంటే...
తెలుగు వారి ఆత్మగౌరవం... ఎన్టీఆర్
తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడుకోవాలని అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగోడి సత్తా ఢిల్లీకి చూపించారు నందమూరి తారకరామారావు. నటుడిగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే పాలిటిక్స్లోకి వచ్చి కేవలం 9 నెలల్లోనే అధికారం కైవసం చేసుకున్నారు ఎన్టీఆర్. 1982 మార్చి 29న తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీని స్థాపించారు.
పేదల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు ప్రవేశపెట్టారు ఎన్టీఆర్. కిలో రూ.2 బియ్యం పథకంతో పాటు ప్రతీ పేదవాడు గౌరవంతో బతకాలని పక్కా ఇంటి నిర్మాణం, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఉచిత వైద్యం ఇలా ప్రజాకర్షక స్కీమ్స్తో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం అయ్యారు.
Also Read : ఓటీటీల్లో డెకాయిట్ To బ్లాక్ బస్టర్ వాలా 2 - ఒకే రోజు 8 సినిమాలు... డిజిటల్ స్ట్రీమింగ్ మూవీస్ లిస్ట్
తమిళనాడులో రాజకీయ శక్తి
తమిళనాడులో ఓ సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించారు ఎంజీఆర్ (మారుత్తూరు గోపాలన్ రామచంద్రన్). నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన పాలిటిక్స్లోకి చేరి పార్టీ స్థాపించి ఏకంగా మూడుసార్లు సీఎంగా గెలిచారు. డీఎంకే నుంచి విడిపోయిన తర్వాత 1972లో ADMK (అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) స్థాపించగా... ఆ తర్వాత AIADMK (ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం)గా మారింది.
మహిళా సాధికారత, పేద ప్రజల సంక్షేమ ప్రధానంగా ఎన్నికల బరిలో నిలవగా తమిళ ప్రజలు ఎంజీఆర్కు పట్టం కట్టారు. 1977, 1980, 1984 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా ఎన్నికయ్యారు. 1987లో ఎంజీఆర్ మరణానంతరం... జయలలిత ఆధ్వర్యంలో ఈ పార్టీ అధికార పార్టీగా కొనసాగింది.
ప్రస్తుతం విజయ్
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ సైతం సినిమాల్లో తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే 'TVK' (తమిళగ వెట్రి కళగం) పార్టీని స్థాపించి పూర్తి స్థాయిలో రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి విజయం సాధించారు. తన మాస్ ఇమేజ్తో అభిమానుల్లో ఉత్సాహం నింపుతూనే... మహిళలు, విద్యార్థులు, యువత కోసం సంక్షేమాన్ని ప్రకటించారు. రైతులు, పేదలకు ఉచిత విద్యుత్, డ్రగ్స్ రహిత తమిళనాడుగా మార్చడం, పోలీస్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు వంటి హామీలతో ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు.
సినిమాలకు దూరమవుతూనే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచీ ప్రచారం వరకూ అన్నీ తానై నడిపించారు. ఎన్నికల ముందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి ఒంటరిగానే పోరాడారు. తన చివరి సినిమా రిలీజ్ ఆపేసినా, డివోర్స్ వ్యవహారం ఇలా ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తనదైన ప్లానింగ్తో ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.
Also Read : విజయ్ పార్టీ ప్రభంజనం... మీ డ్రీమ్స్ నిజమయ్యాయి - త్రిషకు బండ్ల గణేష్ కంగ్రాట్స్
Also Read : విజయ్ ఇంటికి త్రిష - తిరుమల నుంచి దళపతి నివాసానికి... గంట సేపు భేటీ
Author : Ganesh Guptha

