Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thalapathy Vijay Car Collection: దళపతి విజయ్ దగ్గర కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!

Thalapathy Vijay Car Collection: దళపతి విజయ్ దగ్గర కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!

ABP దేశం 5 months ago

Thalapathy Vijay Car Collection Details: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) నేత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎన్నికల వేడి ఒకవైపు ఉంటే, మరోవైపు విజయ్ లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఆయన కార్ల కలెక్షన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

అల్ట్రా లగ్జరీ కార్ల నుంచి మన పక్కింటి వారు వాడే సాదాసీదా కార్ల వరకు విజయ్ గ్యారేజీలో చాలా వెరైటీలు ఉన్నాయి. దళపతి విజయ్ దగ్గర ఉన్న ఆ స్పెషల్ కార్ల గురించి ఇప్పుడు డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (Lexus LM 350h):
విజయ్ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. దీని ధర సుమారు రూ. 2.20 కోట్లు ఉంటుంది. ప్రయాణంలో క్లాస్, కంఫర్ట్ కోరుకునే వారికి ఇది ఫస్ట్ ఛాయిస్. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, లోపల ఒక ప్రైవేట్ లాంజ్ లాగా కనిపిస్తుంది. ఇందులో 48 ఇంచుల భారీ డిస్‌ప్లే, అల్ట్రా ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series):
పెర్ఫార్మెన్స్, స్టైల్ కలిసిన ఈ సెడాన్ కూడా విజయ్ గ్యారేజీలో ఉంది. దీని ధర దాదాపు రూ. 74.80 లక్షల నుండి మొదలవుతుంది. ఇందులో 2.0 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. క్యూడ్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంది. డైలీ వాడకానికి ఇది ఒక బెస్ట్ లగ్జరీ సెడాన్.

బీఎమ్‌డబ్ల్యూ ఐ7 (BMW i7):
మారుతున్న కాలానికి తగ్గట్టుగా విజయ్ ఎలక్ట్రిక్ కార్లను కూడా ఇష్టపడుతున్నారు. అందులో భాగమే ఈ బీఎమ్‌డబ్ల్యూ ఐ7. దీని ధర రూ. 2.5 కోట్లు. ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్. ఇది 449 హెచ్‌పి పవర్‌ను ఇస్తుంది. ఈ కారు వెనుక సీట్లో కూర్చుంటే ఒక థియేటర్ స్క్రీన్, అదిరిపోయే కంఫర్ట్ లభిస్తాయి. స్టైల్‌గా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఈవీ.

టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire):
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్‌లోనే కనిపిస్తున్నారు. దీని ధర రూ. 1.19 కోట్లు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఈ ఎంపీవీ (MPV) అంటే చాలా ఇష్టం. ప్రయాణంలో అలసట లేకుండా ఉండేందుకు ఇందులో సాఫ్ట్ సీట్లు, 2.5 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడానికి, సిటీలో తిరగడానికి ఇది చాలా కంఫర్టబుల్ కారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift):
కోట్ల విలువ చేసే కార్లు ఉన్నా, విజయ్ దగ్గర ఒక మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో ఆయన చాలా సార్లు ఈ కారులోనే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది చాలా సింపుల్, ప్రాక్టికల్ కారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ హ్యాచ్‌బ్యాక్ అంటే ఆయనకు కూడా ఇష్టమే. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, కొన్నిసార్లు సింపుల్‌గా ఉండటానికే మొగ్గు చూపుతారని చెప్పడానికి ఇదే నిదర్శనం.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls-Royce Ghost):
గతంలో విజయ్ దగ్గర రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 1 కారు ఉండేది. ఆ తర్వాత దాన్ని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి12 ఇంజిన్‌తో నడిచే ఈ కారు 563 హెచ్‌పి పవర్‌ను ఇచ్చేది. అప్పట్లో దీని ధర సుమారు రూ. 2 కోట్లుగా ఉండేది. విజయ్ కార్ల కలెక్షన్ చూస్తుంటే ఆయనకు టెక్నాలజీ, లగ్జరీతో పాటు సింప్లిసిటీ అంటే కూడా ఎంతో ఇష్టమని అర్థమవుతోంది. రాజకీయ యాత్రలో ఆయన తన కార్ల ద్వారా కూడా జనాల్లోకి దూసుకుపోతున్నారు.

Author : Ayesha</

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam