'కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ' కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించినా... ఆ సినిమా హర్ష్ రోషన్ (Harsh Roshan)కు విజయం అందించడమే కాదు, తెలుగులో హీరోగా గుర్తింపును కూడా ఇచ్చింది.
ఆ తర్వాత 'బ్యాండ్ మేళం' చేశారు. ఇప్పుడు హార్ష్ రోషన్ హీరోగా అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన సినిమా 'తెల్ల కాగితం' (Thella Kaagitham). రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
గాంధీ జయంతికి 'తెల్ల కాగితం'
Thella Kaagitham Release Date: యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్గా 'తెల్ల కాగితం' తెరకెక్కింది. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ 'చిలకా...' వైరల్ అయ్యాయి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత కృష్ణ కొమ్మలపాటి తెలిపారు.

'తెల్ల కాగితం' సినిమాలో హర్ష్ రోషన్ జంటగా నక్షత్ర నటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే... వీళ్లిద్దరి జంట ఎంతో క్యూట్గా కనిపిస్తోంది. వర్షపు చినుకులు తమ మీద పడకుండా అరిటాకును గొడుగులా అడ్డు పెట్టుకోవడం... ఇద్దరి లుక్స్ కూడా ఎంతో సహజంగా అనిపిస్తున్నాయి.
హిట్ సినిమాలు 'సామజవరగమన', 'నారి నారి నడుమ మురారి'కి కో రైటర్గా పని చేసిన టాలెంటెడ్ నందు సవిరిగాన ఈ 'తెల్ల కాగితం' చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అందించారు. 'బేబీ' సినిమాకు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇంకా ఈ చిత్రానికి దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి, నిర్మాత : కృష్ణ కొమ్మాలపాటి, ఛాయాగ్రహణం: కేవీ గుహన్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.
Author : S Niharika

