Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్

ABP దేశం 1 week ago

This Week OTT Movies Complete List : ఈ వారం థియేటర్లలోకి అఖిల్ అక్కినేని రూరల్ మాస్ ఎంటర్టైనర్ లెనిన్తో పాటు మలయాళ డబ్బింగ్ మూవీ 'ఐ నోబడీ', దేవి ఫేమ్ మహేంద్రన్ హీరోగా నటించిన మైథలాజికల్ ఎపిక్ 'వసుదేవసుతం', నాగదుర్గ తమిళ డబ్బింగ్ మూవీ 'లవ్ ఓ లవ్' మూవీస్ సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల్లోనూ బ్లాక్ బస్టర్ మూవీస్ వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. మరి అవేంటో ఓసారి చూస్తే...

పెద్ది : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకత్వం వహించగా... జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.

సింగ్ గీతం : 94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ సింగ్ గీతం. నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించగా... అయాన్, అహల్య బమ్రూ ప్రధాన పాత్రల్లో నటించారు. షాలిని కొండేపూడి, బెనర్జీ, తులసి, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జులై 9 నుంచి 'నెట్ ఫ్లిక్స్' (Netflix) తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

పరిమళ అండ్ కో : రీసెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్ 'పరిమళ అండ్ కో' (Parimala And Co) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా... జయరాం, ఊర్వశి, అనంతిక సానిల్ కుమార్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ZEE5లో జులై 10 నుంచి... తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఇక్కా (IKKA) : సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇక్కా (Ikka). సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా... దియా మీర్జా, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జులై 10న నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్

ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్

నెట్ ప్లిక్స్ : పెద్ది (జులై 9), సింగ్ గీతం (జులై 9), ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జులై 10), ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ - జులై 8), నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ - జులై 8), సల్సేడో, లెదర్ అండ్ బొగాలో (జులై 8), లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్ - జులై 9), పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ - జులై 10), షిప్ రెక్డ్ : నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జులై 10), ది అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్ - జులై 11), సుసాన అండ్ ఎల్విరా (జులై 12).

అమెజాన్ ప్రైమ్ వీడియో : రేజర్ (తెలుగు మూవీ జులై 5), ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్ - జులై 12).

ZEE5 : ఫ్రేమ్ (మరాఠీ మూవీ - జులై 10), పరిమళ అండ్ కో (తమిళ మూవీ - జులై 10).

సోనీ లివ్ (SonyLIV) : బల్టీ (తెలుగు డబ్బింగ్ మూవీ - జులై 10).

జియో హాట్ స్టార్ : ది ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్ - జులై 10).

లయన్స్ గేట్ ప్లే : ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్ - జులై 10).

ఆపిల్ టీవీ ప్లస్ : ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్ - జులై 8).

Also Read : Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam