Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
This Week OTT Movies : ఓటీటీల్లో డెకాయిట్ To బ్లాక్ బస్టర్ వాలా 2 - ఒకే రోజు 8 సినిమాలు... డిజిటల్ స్ట్రీమింగ్ మూవీస్ లిస్ట్

This Week OTT Movies : ఓటీటీల్లో డెకాయిట్ To బ్లాక్ బస్టర్ వాలా 2 - ఒకే రోజు 8 సినిమాలు... డిజిటల్ స్ట్రీమింగ్ మూవీస్ లిస్ట్

ABP దేశం 1 month ago

This Week OTT Telugu Movies Web Series Complete List : ఈ వారం ఓటీటీల్లో డబ్బింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి. మలయాళంలో రీసెంట్గా బ్లాక్ బస్టర్స్గా నిలిచిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి.

దీంతో పాటే అడివి శేష్ డెకాయిట్ కూడా ఓటీటీలోకి రానుంది.

అడివి శేష్ 'డెకాయిట్'

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రీసెంట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డెకాయిట్'. షానిల్ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ప్రదీప్ రంగనాథన్ 'LIK'

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన రీసెంట్ లవ్ ఎంటర్టైనర్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). ఈ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా... ఎస్ జే సూర్య కీలకపాత్ర పోషించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు భాషలతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

రూ.200 కోట్ల 'వాలా 2'

కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించిన రీసెంట్ మలయాళ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వాలా 2'. సవిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 2న రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో ఈ నెల 8 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Also Read : శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది - జీవిత ప్రపోజ్ చేసేలా నేను చేశా... హీరో రాజశేఖర్ లైఫ్లో క్యూట్ మూమెంట్స్

Also Read : విష్ణు ప్రియ, అషు రెడ్డి రూటులో శ్రీ రెడ్డి - ఇన్ స్టా గేట్స్ ఓపెన్... ఎంత మంది సబ్స్కైబర్స్ అంటే?

అమెజాన్ ప్రైమ్ వీడియో - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 6), సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 6), డెకాయిట్ (తెలుగు మూవీ - మే 8), లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 8)

నెట్ ఫ్లిక్స్ - భరతనాట్యం 2 మోహినీయట్టం (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 8)

జియో హాట్ స్టార్ - వాలా 2 (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 8), సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ - మే 8)

సన్ నెక్స్ట్ - ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ - మే 8), సూపర్ హిట్ (కన్నడ మూవీ - మే 8)

ZEE5 - లవ్ మాక్ టైల్ 3 (కన్నడ మూవీ - మే 8).

అలాగే, థియేటర్లలో లావణ్య త్రిపాఠి సతీ లీలావతి, రవిబాబు రేజర్, సుమంత్ ప్రభాస్ గోదారి గట్టుపైన, రైతు దంపతుల స్పిరిట్, రిషబ్ శెట్టి నిర్మించిన ఏ ఫిల్మ్ బై గిరి ఈ వారం థియేటర్లలోకి రానున్నాయి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam