Tirumala 2026: ఏటా చైత్ర మాసం వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవం' అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీనిని 'ఉపశమనోత్సవం' అని కూడా పిలుస్తారు.
ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే వివిధ రకాల పూలతో పాటూ మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు.

ఈ వేడుక కోసం వట్టివేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. కోతులు, ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్లు, పాముల సహా అన్ని జంతువులు, పలురకాల చెట్లు ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా మండపం తీర్చిదిద్దారు

ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు.

వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం పూర్తిచేశారు. ఆ తర్వాత ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు.

అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకం వైఖనసాగమోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలో అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను పఠించారు.

ఈ వేడుకలో భాగంగా ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన పూలమాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు

వసంత అంటే వసంత రుతువు.. ఉత్సవం ఉంటే పండుగ..కలపి వసంతోత్సవం అయింది. వసంతకాలంలో ప్రకృతి పునరుజ్జీవం పొందుతుంది. ఆనందం, పునరుద్ధరణ, సానుకూలతను సూచిస్తుంది. ఈ నెలలో స్వామివారికి ప్రత్యేక ఆరాధన చేయడం ద్వారా ప్రకృతి-దేవ సంబంధాన్ని గౌరవిస్తారు. చైత్ర - వైశాఖ మాసాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఉపశమనం కలిగించేందుకే ఈ వేడుక. ఈ ఉత్సవాన్ని కన్నులారా దర్శించుకున్నవారికి ఆధ్యాత్మిక శాంతి, కర్మ శుద్ధి, పునరుజ్జీవం ఇస్తుందని భక్తుల విశ్వాసం. మనస్సు శాంతి, ఆనందం పొందుతామన ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టం అని భక్తులు భావిస్తారు. క్రీస్తు శకం 1460లో అచ్యుతరాయుల కాలంలో ప్రారంభమైంది స్వామివారి వసంతోత్సవం. చారిత్రక ఆధారాల ప్రకారం 14వ శతాబ్ధం నుంచి ఉత్సవం జరుగుతోంది. విజయనగర రాజుల కాలంలో వసంత మండపం నిర్మించారు. ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు వసంతోత్సవం జరుగుతుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత మరో ముఖ్యమైన ఉత్సవం ఇది. భారీగా భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది?
ఆర్థిక ఇబ్బందులు తొలగించే శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహా మంత్రం! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉంది!" href="https://telugu.abplive.com/spirituality/sri-srinivasa-aishwarya-maha-mantram-in-tirumala-temple-know-significance-in-telugu-233926" target="_self">
Author : RAMA

