Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!

ABP దేశం 1 month ago

TVS Jupiter 110 Price And Features Telugu: టీవీఎస్ జూపిటర్ 110లో కొత్త వేరియంట్‌ లాంచ్‌ అయింది. 'స్పెక్ట్రల్' (Spectral) పేరుతో కొత్త టాప్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.

ఈ కొత్త మోడల్‌లో డ్యూయల్ టోన్ రంగులను ప్రత్యేక ఆకర్షణగా అందిస్తోంది. కొత్త రంగులతో పాటు కొన్ని అదనపు ఫీచర్లను కూడా జోడించింది. దీంతో జూపిటర్ 110 మరింత ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది.

టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్ వేరియంట్ ధరను రూ.89,825గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ప్రస్తుతం జూపిటర్ 110లో ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్‌. కొత్త మోడల్‌ను త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

రెండు కొత్త రంగులు

స్పెక్ట్రల్ వేరియంట్‌ను రెండు డ్యూయల్ టోన్ రంగుల్లో తీసుకొచ్చారు. స్పెక్ట్రల్ బ్లూ & స్పెక్ట్రల్ కాపర్ రంగులతో లాంచ్‌ చేశారు. ఈ రంగులకు అనుగుణంగా స్కూటర్ లోపలి ప్యానెళ్లకు కూడా కొత్త రంగులు ఇచ్చారు. సీటుకు కొత్త రంగు అందించారు. పాక్షిక క్రోమ్ మిర్రర్లను కూడా ఈ వేరియంట్‌లో చూడొచ్చు. కొత్త రంగులు జూపిటర్ 110కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కాస్మెటిక్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

రెండు కొత్త ఫీచర్లు

స్పెక్ట్రల్ వేరియంట్‌లో రెండు అదనపు ఫీచర్లను కంపెనీ యాడ్‌ చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ ఒకటి. వెనుక కూర్చునే ప్రయాణికుడికి ఇది అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

మరో ముఖ్యమైన ఫీచర్ సీక్వెన్షియల్ ఇండికేటర్లు. ఈ విభాగంలో తొలిసారిగా ఇలాంటి ఇండికేటర్లను అందిస్తున్నట్లు టీవీఎస్ చెబుతోంది. దీంతో జూపిటర్ 110లో లైటింగ్ సెటప్ మరింత ప్రత్యేకంగా మారింది.

: రూ.10000 డౌన్‌పేమెంట్ చేసి TVS Jupiter కొంటే ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి

మెకానికల్‌గా మార్పులు లేవు

కొత్త స్పెక్ట్రల్ వేరియంట్‌లో ఇంజిన్‌కు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 113.3cc పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 8hp శక్తిని & 9.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్క్ SXC & స్పెషల్ వేరియంట్లలో ఉన్న మెకానికల్ సెటప్‌నే ఇందులోనూ కొనసాగించారు.

జూపిటర్ 110లో 33 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. సెగ్మెంట్‌లో ఇది అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న స్కూటర్లలో ఒకటి. ఇంధన ట్యాంక్‌ను ముందు భాగంలోని ఏప్రాన్‌లో అమర్చారు. దీంతో ఇంధనం నింపడం సులభంగా ఉంటుంది.

ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంది. దీని ద్వారా ఇంజిన్ నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్-స్టాప్ సాంకేతికత కూడా ఇందులో ఉంది. ట్రాఫిక్‌లో అవసరం లేని సమయంలో ఇంజిన్‌ను ఆపడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంలో ఇది సహాయపడుతుంది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ కూడా కొనసాగుతోంది. రోజూ ప్రయాణించేవాళ్లకు అవసరమైన సౌకర్యాలు & కనెక్టివిటీ ఫీచర్లను ఇది అందిస్తుంది.

: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు

ధరలో ఎంత తేడా?

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ డిస్క్ వేరియంట్‌తో పోలిస్తే, స్పెక్ట్రల్ వేరియంట్ ధర రూ.3,000 ఎక్కువ. స్పెషల్ ఎడిషన్‌తో పోలిస్తే రూ.525 అదనంగా చెల్లించాలి. కొత్త రంగులు, అదనపు ఫీచర్లను కోరుకునేవాళ్లకు ఈ వేరియంట్ ఆకర్షణీయమైన ఎంపిక కాగలదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Author : Arun Kumar Veera

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam