Dailyhunt
Top 7 Electric Scooters in India with Largest Boot Space: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా?  భారీ బూట్ స్పేస్ అందించే టాప్ 7 ఈవీ స్కూటర్లు ఇవే!

Top 7 Electric Scooters in India with Largest Boot Space: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? భారీ బూట్ స్పేస్ అందించే టాప్ 7 ఈవీ స్కూటర్లు ఇవే!

ABP దేశం 1 month ago

Top 7 Electric Scooters in India with Largest Boot Space: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం వేగంగా పెరుగుతోంది. కేవలం రేంజ్, స్పీడ్ మాత్రమే కాకుండా నిత్యం వాడుకోవడానికి వీలుగా ఉండే 'ప్రాక్టికాలిటీ' కి ఇప్పుడు జనం ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముఖ్యంగా సీటు కింద ఉండే స్టోరేజ్ స్పేస్ (బూట్ కెపాసిటీ) అనేది హెల్మెట్లు, కిరాణా సామాగ్రి, ఛార్జర్ వంటివి దాచుకోవడానికి చాలా ముఖ్యం. పెట్రోల్ ఇంజిన్ భాగాలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లలో తయారీదారులు ఎక్కువ స్థలాన్ని కేటాయించగలుగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో భారీ డిక్కీ సౌకర్యం కలిగిన టాప్ 7 ఈవీ స్కూటర్లు గురించి పరిశీలిద్దాం.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) - 32 లీటర్లు..

టీవీఎస్ ఐక్యూబ్ తన లేటెస్ట్ వేరియంట్లలో 30 నుండి 32 లీటర్ల స్టోరేజ్ అందిస్తోంది. ఇందులో హెల్మెట్తో పాటు రెయిన్ కోట్, గ్లోవ్స్ వంటివి సులభంగా ఉంచవచ్చు. పాత మోడళ్లతో పోలిస్తే టీవీఎస్ ఇప్పుడు ఇంటర్నల్ లేఅవుట్ మార్చి స్పేస్ పెంచింది.

ఏథర్ రిజ్టా (Ather Rizta) - 34 లీటర్లు..

ఫ్యామిలీ స్కూటర్గా పేరు తెచ్చుకున్న ఏథర్ రిజ్టాలో 34 లీటర్ల డీప్ స్టోరేజ్ లభిస్తుంది. దీని డిక్కీ లోతుగా ఉండటం వల్ల బల్కీ ఐటమ్స్ (పెద్ద వస్తువులు) సర్దుకోవడం చాలా ఈజీ.

టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter) - 34 లీటర్లు

సిటీ కమ్యూటర్లను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ కూడా 34 లీటర్ల బూట్ స్పేస్తో వస్తోంది. రోజువారీ ఆఫీస్ బ్యాగులు లేదా చిన్న పర్సనల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది పక్కాగా సరిపోతుంది.

సింపుల్ వన్ (Simple One) - 35 లీటర్లు

సింపుల్ వన్ తన అప్డేటెడ్ వెర్షన్లలో 35 లీటర్ల సీట్ స్టోరేజ్ ఇస్తోంది. రైడింగ్ గేర్ మొత్తం డిక్కీలోనే సర్దేయొచ్చు.

బజాజ్ చేతక్ (Bajaj Chetak) - 35 లీటర్లు

క్లాసిక్ లుక్ తో వచ్చే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల స్టోరేజ్ కలిగి ఉండటం విశేషం. కొన్ని వేరియంట్లలో అదనంగా 5 లీటర్ల గ్లోవ్ బాక్స్ సదుపాయం కూడా ఉంది.

కైనెటిక్ డిఎక్స్ (Kinetic DX) - 37 లీటర్లు

కైనెటిక్ డిఎక్స్ 37 లీటర్ల భారీ స్పేస్తో టాప్ 2లో నిలిచింది. దీని ప్రధాన స్టోరేజ్ కింద మరొక రహస్య కంపార్ట్మెంట్ ఉండటం వల్ల డాక్యుమెంట్లు, చిన్న ఛార్జర్లు భద్రంగా దాచుకోవచ్చు.

రివర్ ఇండీ (River Indie) - 43 లీటర్లు

ప్రస్తుతానికి ఇండియాలోనే అత్యధికంగా 43 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన స్కూటర్ 'రివర్ ఇండీ గా ఘనత సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని కేవలం యుటిలిటీ కోసమే డిజైన్ చేశారు. ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్తో పాటు అదనపు పానియర్లు (Panniers) తగిలించుకునే ఆప్షన్ కూడా ఉంది. ఎక్కువ సామాగ్రి మోసుకెళ్లే వారికి ఇది ఒక మినీ ఎస్యూవీ లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఎక్కువ బూట్ స్పేస్ ఉండే వాహానాలను తీసుకుంటే దీర్ఘకాలికంగా అనేక రకాలుగా ఉపయోగముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కూటీల విషయంలో ఇది ఇంపార్టెంట్ విషయమని అంటున్నారు.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam