Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

ABP దేశం 2 months ago

Track Switched Off Phone for Android and iPhone Users : ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడానికి మాత్రమే కాదు.. స్టడీ, బ్యాంకింగ్, ఆన్లైన్ పేమెంట్స్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్స్, వినోదం వంటివన్నీ పోన్ ద్వారానే జరుగుతున్నాయి.

అందుకే చాలామంది తమ జీవితాన్ని ఫోన్లోనే గడిపేస్తున్నారు. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగతనం చేసినా.. చాలా పానిక్ అయిపోతారు. కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనే ఆలోచన కన్నా.. వ్యక్తిగత డేటా, ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారం, ముఖ్యమైన పత్రాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనన్న భయం ఉంటుంది.

ఫోన్ను ఎవరైనా దొంగలిస్తే వారు చేసే మొదటి పని.. దాని లొకేషన్ను గుర్తించకుండా ఉండేందుకు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయడమే. ఇలా చేస్తే ఫోన్ను కనుగొనడం దాదాపు అసాధ్యం అని చాలామంది నమ్ముతారు. అలాగే ఫోన్ పోయిందంటే చాలామంది ఆశలు కూడా వదిలేస్తారు. కానీ కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ముందే ఆన్ చేసి ఉంటే.. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ చివరి లొకేషన్ను కూడా ట్రాక్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ 'ఫైండ్ మై డివైస్' అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ పోగొట్టుకున్న ఫోన్ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ.. అది చివరిగా యాక్టివ్గా ఉన్న లొకేషన్ను చూపించగలదు. అయితే ఫోన్ అప్పటికే ఒక గూగుల్ అకౌంట్కు లాగిన్ అయి ఉండాలి. అలాగే ఫైండ్ మై డివైస్ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉండాలి. వినియోగదారుడు వేరొక డివైస్ లేదా కంప్యూటర్ నుంచి అదే అకౌంట్కు లాగిన్ అయినప్పుడు.. ఫోన్ చివరి లొకేషన్ను మ్యాప్పై కనిపిస్తుంది.

ఈ ఫీచర్ మీ లొకేషన్ను చూసేందుకు మాత్రమే కాకుండా, అవసరమైతే మీ ఫోన్ను రిమోట్గా లాక్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనివల్ల ఇతరులు మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. ఫోన్ దొంగతనం జరిగినప్పుడే కాదు.. కనిపించకుండా పోయినా.. ఎక్కడైనా పడేసుకున్నా కూడా ఈ ఫీచర్ వినియోగించడం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మీ ఫోన్ పోయినప్పుడు దాన్ని సులభంగా ట్రాక్ చేయాలంటే.. ముందుగానే కొన్ని సెట్టింగ్లను ఎనేబుల్ చేసి ఉంచుకోవాలి. మీ ఫోన్లో లొకేషన్ సర్వీసులు ఎనేబుల్ చేసి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఫైండ్ మై డివైస్ ఫీచర్ కూడా ఎనేబుల్ చేసి ఉంచుకోవడం చాలామంచిది. ఇది మీ ఫోన్ మీకు దూరంగా ఉన్నప్పుడు గుర్తించేందుకు హెల్ప్ అవుతుంది.

యాపిల్ యూజర్స్ కోసం..

స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ట్రాకింగ్ సంబంధించిన కొన్ని అధునాతన ఫీచర్లు కొన్ని దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వాటిని ఇండియాకు కూడా తీసుకురావచ్చు. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు ఫైండ్ మై ఫీచర్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆన్లో ఉంటే.. ఫోన్ ఆఫ్లైన్లోకి వెళ్లినప్పటికీ దాని చివరి లొకేషన్ను చూడవచ్చు.

ఈ ఫీచర్ కోసం వినియోగదారులు తమ ఆపిల్ ఖాతాలోని సెట్టింగ్స్లోకి వెళ్లి, ఫైండ్ మై, ఫైండ్ మై నెట్వర్క్ వంటి ఆప్షన్లను ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల వారు మరొక ఆపిల్ డివైజ్ లేదా ఐక్లౌడ్ ఖాతా ద్వారా.. పోగొట్టుకున్న ఐఫోన్ గురించిన సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. అవసరమైతే ఫోన్ను రిమోట్గా లాక్ చేసే ఆప్షన్ కూడా వారికి ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.

ముందు జాగ్రత్త చాలా ముఖ్యం

చాలా మంది తమ ఫోన్ను పోగొట్టుకున్న తర్వాతే ఈ ఫీచర్ల గురించి ఆలోచిస్తారు. కానీ సెట్టింగ్లు ముందే యాక్టివేట్ చేసి ఉంటేనే అవి నిజంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ రోజే మీ స్మార్ట్ఫోన్లో ట్రాకింగ్, సెక్యూరిటీ ఫీచర్లను ముందుగానే ఎనేబుల్ చేసుకోండి. క్లిష్ట పరిస్థితులలో మీ ఫోన్ను కనుగొనే అవకాశాలను ఇది గణనీయంగా పెంచుతుంది. అలాగే మీ పర్సనల్ డేటా సేఫ్​గా ఉంటుంది.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam