తిరుచ్చి(ఈస్ట్), పెరుంబూర్లో విజయ్ పోటీ చేశారు. ఆ రెండు సీట్లలో కూడా అద్భుతమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆయన రెండు స్థానాల్లో గెలిస్తే కచ్చితంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన శాశ్వతంగా పోటీ చేసే చోటును ఎంచుకొని మిగతా ప్రాంతాన్ని వదులుకోవాలి. అక్కడి నుంచే త్రిషను పార్టీ తరఫున టికెట్ కేటాయించి పోటీ చేయిస్తారని అంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చారు. బయటకు కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారని చెప్పుకుంటున్నారు. దీనికి కృతజ్ఞతగా త్రిషను రాజకీయాల్లోకి తీసుకొచ్చే బాధ్యత విజయ్ భుజానికి ఎత్తుకున్నట్టు తమిళనాట జరుగుతున్న ప్రచారం.
తమిళనాడు సీఎంగా విజయ్! ఎన్నికల్లో టీవీకే బ్లాక్బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్ఆర్డర్ ఢమాల్!
త్రిష, విజయ్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఎన్నికల నోటఫికేషన్ పడిన తర్వాత విజయ్ భార్య సంగీత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సీనియర్ హీరోయిన్తో తన భర్త విజయ్ తిరుగుతున్నారని ఆయన నుంచి విడాకులు ఇవ్వాలని కోర్టుకెక్కారు. దీన్ని ప్రత్యర్థులు తమ ప్రచారంలో వాడుకున్నారు. అయితే విజయ్ మాత్రం దాన్ని లైట్ తీసుకున్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని, వాటి సంగతి తాను చూసుకుంటానని, పార్టీ విజయం, ప్రజా సమస్యలపై దృష్టి పెడదామని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టారు. కానీ ప్రత్యర్థులు మాత్రం ప్రచారంలో దాన్ని ఓ ప్రచారం అస్త్రంగా మార్చుకున్నారు.